kishanreddy : కాంగ్రెస్ హయాంలో ఎన్నో కుంభకోణాలు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 4 కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటం తర్వాత అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందన్నారు. 42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్. By Vijaya Nimma 18 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి హామీలను అమలుచేయలేని పరిస్థితి బీఆర్ఎస్‌తో పొత్తుపెట్టుకుని అధికారాన్ని పంచుకుని.. తెలంగాణ ఇవ్వకుండా ఆలస్యం చేసింది కాంగ్రెస్ పార్టీ అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. 4 కోట్ల మంది ప్రజలకు నిరంతర పోరాటం తర్వాత అనేక ఉద్యమాల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్మని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టిందన్నారు. 42 రోజుల పాటు తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే కానీ స్పందించని పార్టీ కాంగ్రెస్. హామీ ఇచ్చాం.. తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ అంటోంది. తెలంగాణ ప్రజలు ఉద్యమం చేసి మీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నారు. కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలతో కాంగ్రెస్ పార్టీ రాలేదన్నారు. 1952 నుంచి కూడా అనేక రకాలుగా హామీలు ఇచ్చారు. 1971లో గరీబీ హటావో, 16 పాయింట్ పార్ములా.. ఏ ఒక్కదాన్నీ అమలు చేయలేదు. నిన్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు మోసపూరితమైనవి. గతంలో ఇచ్చిన హామీలను అమలుచేయలేని పరిస్థితి ఉందన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో కుంభకోణాలు ఎన్నో జరిగాయి. దోచుకోవడం, దాచుకోవడం మాత్రమే తెలుసు.. ఈ హామీలల్లో పూర్తిగా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం తప్ప.. ఇవేవీ అమలు చేయలేని పరిస్థితి కాంగ్రెస్ పార్టీది అని మండిపడ్డారు. చరిత్రను వక్రీకరించొద్దు రాష్ట్రంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత పెంచేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందన్నారు. నిరుద్యోగుల కోసం ధర్నా చేస్తే.. మా కార్యకర్తల మీద జులూం ప్రదర్శించారు. చాలా మంది ఇంకా ఆస్పత్రుల్లో ఉన్నారు. ప్రభుత్వం, పోలీసులు ధర్నాచౌక్‌లో అనుమతిచ్చిన తర్వాత కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ రెండు పార్టీలు ఒకటే. కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలం లేదు. ఇవాళ కాకపోయినా.. ఎన్నికల తర్వాతైనా.. కలిసే పార్టీలే. బీజేపీ బలపడకుండా కుట్రలు చేస్తున్నారు. కానీ బీజేపీ ఎదుగుదలను ఎవరూ అడ్డుకోలేరన్నారు. తెలుగు ప్రజలు కాంగ్రెస్ పార్టీని విశ్వసించే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం రోజు హైదరాబాద్‌లో సమావేశం పెట్టుకుని.. కనీసం తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. గత 75 ఏళ్లుగా.. అధికారంలో ఉన్నప్పుడు తెలంగణ దినోత్సవ చరిత్రను తొక్కిపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ కాదా అన్నారు. సెప్టెంబర్ 17న సమావేశం హైదరాబాద్‌లో పెట్టుకునే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. 1998 నుంచి బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాలు జరపాలంటూ డిమాండ్ చేస్తోంది. ఇందుకోసం కలెక్టర్ కార్యాలయాలపై జెండాలు ఎగురవేసి.. దెబ్బలు తిన్నాం. బీఆర్ఎస్ సమైక్యత దినం అని చెప్పి.. పెద్దల త్యాగాలను తెరమరుగు చేసే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇది ఏరకంగా సమైక్యత దినం..? అని సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. ఎవరి ద్వారా సమైక్యత సాధ్యమైంది..? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ఓ మాట. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట.. చేత కాకపోతే.. మజ్లిస్‌కు భయపడితే ఏ ఉత్సవాలు చేయొద్దు. కానీ చరిత్రను వక్రీకరించొద్దన్నారు. బీజేపీ ఎలాంటి సమస్యలేకుండా విభజించింది కుహనా లౌకిక వాదంతో.. మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారు. ఏడ్చిన వాళ్ల కళ్లు తుడిచినట్లు.. పబ్లిక్ గార్డెన్‌లో కార్యక్రమం చేసి చేతులు దులుపుకున్నారు. ఏరకంగానైతే.. 15 ఆగస్టు, 26 జనవరి నిర్వహిస్తామో.. అలాగే సెప్టెంబర్ 17ను కూడా రాష్ట్రవ్యాప్తంగా వైభవోపేతంగా జరపాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకల్లో విముక్తి ఉత్సవాలు జరిగితే.. తెలంగాణలో.. సమైక్యత పేరుతో కార్యక్రమాలా..? నిన్న జరిగిన కేంద్ర సాంస్కృతికశాఖ ఆధ్వర్యంలో అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాం. చాలా అద్భుతంగా జరిగిందన్నారు. కేసీఆర్ కుటుంబానికి దేన్నీ అర్థం చేసుకునేలా లేదన్నారు. 80వేల పుస్తకాలు చదివిన వ్యక్తికి.. సమైక్యతకు, విమోచనానికి తేడా తెలియదా..? అన్నారు. ప్రధాన మంత్రి .. మాట్లాడుతూ.. బీజేపీ మూడు రాష్ట్రాలను ఎలాంటి సమస్యలేకుండా విభజించిందన్నారు. కానీ కాంగ్రెస్ అసమర్థత కారణంగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విడిపోవడం.. పెప్పర్ స్ప్రేలు వాడేలా పరిస్థితి తలెత్తిందని మాత్రమే అన్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి