Mango Pickle Recipe: మామిడికాయ పచ్చడి అంటే తెలియని వాళ్లు ఉండరు. వేసవి మామిడి పండ్ల రుచి ఏడాది పొడవునా మనదంరికి గుర్తుండిపోతుంది. పురాతన కాలంలో నుంచి మామిడి పచ్చడిని తయారు చేసే పద్దతి ఉంది. ఇంట్లో తయారు చేసిన మామిడికాయ పచ్చడి శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. అంతేకాదు వ్యాధుల నుంచి దూరంగా ఉంచడంలో కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ప్రతిఒక్కరికి మామిడికాయ పచ్చడి తెలుసు. మామిడికాయ పచ్చడి క్రేజ్ ఎంతగా ఉందంటే.. వంటకాల్లో ఈ ఆహారాన్ని అగ్రస్థానానికి చేర్చింది. మామిడికాయ పచ్చడి తింటే ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులు నయమవుతాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి మామిడికాయ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
- పచ్చి మామిడి విటమిన్ ఎ, కె, సి,బి6 కాల్షియం, ఐరన్, మెగ్నీషియం మొదలైన ఖనిజాలను పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల జీర్ణశక్తి పెరిగి కాలేయం ఆరోగ్యవంతంగా ఉంటుంది. వేసవిలో అందుబాటులో ఉన్న పచ్చి మామిడిలను ఊరగాయను తయారు చేయడం ద్వారా ఏడాది పొడవునా దాని ప్రయోజనాలను పొందవచ్చు.
మామిడికాయ పచ్చడి తయారీ
- పచ్చి మామిడికాయను కోసి ఎండలో బాగా ఆరబెట్టాలి. అప్పుడు వాటిని 30 నిమిషాలు ఉప్పు నీటిలో ఉంచండి. వాటిని తీసి శుభ్రమైన గుడ్డతో తుడవాలి. మిరపకాయ పొడి, ఆవాలు-మెంతి గింజల పొడి, లేత ఉప్పు, చల్లారిన ఆవాల నూనెను బాగా కలుకోవాలి. ఈ మిశ్రమాన్ని గాలి చొరబడని జాడీలో వేసి కొన్ని రోజులు పులియబెట్టి తర్వాత దానిని తినాలి.
క్యాన్సర్ నివారణ ఔషధం
- మామిడిలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి పులియబెట్టినప్పుడు ఫ్రీ రాడికల్స్ క్యాన్సర్‌కు కారణమయ్యే కణాలను నాశనం చేస్తుందని నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిపుణులు తెలిపారు.
గ్యాస్, అసిడిటీ,మలబద్ధకం దూరం
- పులియబెట్టిన ఆహారాలు ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్‌లను అందిస్తాయి. అంతేకాదు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఓ పద్ధతిలో ఊరగాయలు తింటే జీర్ణశక్తి పెరుగుతుంది. గ్యాస్, మలబద్ధకం, అసిడిటీ సమస్యలతోపాటు బరువు తగ్గుతారు.
కీటో డైట్‌లో పచ్చళ్లను తప్పనిసరి
- కీటో డైట్ బరువు తగ్గడానికి మంచిగా ఉంటుంది. అయితే.. దీనిని అనుసరించడం వల్ల సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ లోపం వస్తుంది. దీనివల్ల శక్తి లేకపోవడం, అలసట, కళ్లు తిరగడం, చేతులు, కాళ్లు వణుకడం వంటి సమస్యలు వస్తాయి. మామిడి పచ్చడి సోడియం స్థాయిని పెంచుతుంది.
డయాబెటిక్ ఉన్నవారు..
- సహజసిద్ధమైన చక్కెర ఉన్నందున మధుమేహ రోగులు మామిడిని తినలేరు. కానీ కిణ్వ ప్రక్రియ సమయంలో..ఆరోగ్యకరమైన బ్యాక్టీరియా ఈ సహజ చక్కెరను తగ్గిస్తుంది.
ఇది కూడా చదవండి: ఇవి పాటించండి.. ఆహారంలో ఇవి చేర్చుకోండి.. బీపీ తగ్గుతుంది..!!
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.