Vaamu Rasam: వాము రసం తయారీ విధానం ఇదే.. తాగితే ఎన్నో ప్రయోజనాలు!

వాముతో తయారు చేసే ఆహారాలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతోపాటు పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వాముతో రసం చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ వాము రసం తయారీ విధానం కోసం ఆర్టికల్ మొత్తం చదవండి

New Update
Vaamu Rasam: వాము రసం తయారీ విధానం ఇదే.. తాగితే ఎన్నో ప్రయోజనాలు!

Vaamu Rasam: వాము అందరి వంటింట్లో కనిపించే దినుసు. ఆహారం జీర్ణం కానపుడు వాము తింటారు. వాము శరీరంలో వాతాన్ని హరింపజేస్తుంది.
జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. కడుపు ఉబ్బరం, ప్లీహవృద్ధిని, వాంతులను తగ్గిస్తుంది. గుండెకు కూడా అత్యంత ఉపయోగకారంగా ఉంటుంది. వాముతో ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్న విషయం తెలిసిందే. ఇంటి చుట్టుపక్క ఉంటే వాము ఆకులు, వాముతో రకరకాలైన ఆహారాలు తయారు చేసేవారు. ఉడికీ ఉడకని ఆహారం తింటే సరిగ్గా జీర్ణం కాక ఇబ్బంది పడుతారు. దీంతో కడుపులో నొప్పి, అజీర్తి, పొట్ట పట్టేయడం వంటి సమస్యలు వస్తాయి. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే.. వాము ఎంతో మేలు చేస్తుంది. వాముతో తయారు చేసే ఆహారాలు తింటే జీర్ణ వ్యవస్థ మెరుగుపడటంతోపాటు పొట్ట ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఏ కాలంలోనైనా వాముతో రసం చేసుకుని తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో ఆరోగ్య గుణాలు ఉన్న వాము రసానికి కావాల్సిన పదార్థాలు..? ఎలా తయారు చేస్తారో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:

వాము, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కొత్తి మీర, చింత పండు, బెల్లం తురుము, ఉప్పు, కారం, పసుపు, ఆయిల్, జీలకర్ర, ఆవాలు, తాళింపు దినుసులు.

తయారీ విధానం:

ముందుగా వాము రసం తయారు కోసం ఒక లోతైన పాత్ర తీసుకుని.. అందులో చింత పండు, ఉప్పు, ఉల్లి పాయ ముక్కలు, పసుపు, పచ్చి మిర్చి ముక్కలు వేసి కలపాలి. ఈ గిన్నెను స్టవ్ పెట్టి.. మీడియం మంటపై 15 నిమిషాలు మరిగించాలి. తర్వాత కరివేపాకు, కొత్తి మీర, తురిమిన బెల్లం కూడా వేయాలి. తరువాత దానిలో కొద్దిగా వాము వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి.. ఈ రసానికి నచ్చిన తాళింపు దినుసులతో పోపు పెట్టాలి. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వాము రసం సిద్ధం అవుతుంది. వేడి వేడి అన్నంలో ఈ వాము రసం తిన్న.. ఉత్తరసం తాగిన ఆరోగ్యానికి మంచింది. పిల్లలకు వామురసం పెడితే వారిలో ఉండే నులి పురుగులు నశిస్తాయి. జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: నల్ల ద్రాక్షతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!

గమనిక:ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

Advertisment
తాజా కథనాలు