Plum Fruits Benefits: రేగి పండ్లతో ఎన్నో ప్రయోజనాలు..అవేంటో తెలుసుకోండి!

తెలుగు రాష్ట్రాల్లో రేగి పండ్లును తినేవారు ఎక్కువ. పల్లెటూర్లో ఎక్కువగా పొలాల్లో ఈ చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. గొంతు నొప్పి తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఇన్ఫెక్షన్‌, కడుపు సమస్యలను దూరం చేస్తుంది.

Plum Fruits Benefits: రేగి పండ్లతో ఎన్నో ప్రయోజనాలు..అవేంటో తెలుసుకోండి!
New Update

Plum Fruits Benefits: రేగి పండ్లు ఈ పండ్లు తెలియనోళ్ళంటూ ఎవరూ ఉండరు. ఈ చెట్లు పల్లెటూర్లో ఎక్కువగా పొలాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ పండ్లు అనగానే మనకి మొదటగా నోట్లో లాలాజలం ఊరుతుంది. పుల్లగా, తీయగా ఉండే ఈ పండ్లను అందరూ ఇష్టంగానే తింటారు. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పండ్లను తినేవారు ఎక్కువ. ఈ రేగి పండ్ల పచ్చడి కూడా కొంతమంది పెట్టుకుంటారు. అయితే.. ఆయుర్వేదంలో ఈ చెట్టు బెరడును ఉపయోగించి ఎన్నో కషాయాలను తయారు చేసి మలబద్దక నివారణకు వాడుతారు. వీటి ఆకులను నూరి గాయంపై రాస్తే గాయాలు తగ్గిపోతాయని చెబుతున్నారు. అంతేకాకుండా.. ఇంకా ఎన్నో రోగాలను దూరం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి రేగిపండ్లతో ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో అవేంటో ఒకసారి ఇప్పుడు చూద్దాం.

ఇది కూడా చదవండి: బ్లాక్ క్యారెట్ల వలన ఎన్నో ప్రయోజనాలు..ఇలా తింటే బెస్ట్

చాలామందికి ఏమైనా తిన్నాకాని కడుపులో మంటగా అనిపిస్తుంది. ఈ మంటను తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా అయ్యేలా ఈ రేగి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా.. బరువు తగ్గాలనుకునే వారికి ఈ రేగి పండ్లు చాలా బెస్ట్ అంటున్నారు. కండరాలకి బలాన్నివ్వడంతోపాటు శారీరక శక్తిని ఇవ్వడంలో ఈ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పండ్లను చలికాలంలో తింటే దగ్గు, జలుబు వస్తుందని చాలామంది అంటారు. కానీ.. ఎలాంటి సమస్యలు ఏమి రావని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఏ సీజన్లో వచ్చిన పండ్లను తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ రేగి పండ్లను తింటే కీళ్లనొప్పులు కూడా తగ్గుతాయని చెబుతున్నారు.

రేగిపేస్టు రాస్తే చర్మం మృదువుగా ఉంటుంది

ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేసి, ఆకలి లేని, రక్తహీనత, గొంతు నొప్పి, నీరసం వంటి సమస్యలను దూరం చేస్తుంది. నిద్రలేమి సమస్యలను తగ్గించడంలో రేగి పండ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈమధ్యకాలంలో చాలామంది జుట్టు సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటివారు జుట్టు ఆరోగ్యం కోసం, ఒత్తుగా పెరగాలంటే ఈ పండ్లను తినడం ఎంతో మంచిది అంటున్నారు. శరీరంపై ఎక్కడైనా గాయం అయితే రేగిపేస్టు రాయడం వల్ల ఆ గాయం త్వరగా పోయి చర్మం మృదువుగా తయారవుతుంది. రేగిలో ఉండే యాంటీమైక్రోబయల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు ఇన్ఫెక్షన్‌లో భారీ నుంచి కాపాడుతాంతో పాటు కడుపు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

#health-benefits #plum-fruits
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe