Camphor Lamp: ఇంట్లో కర్పూర దీపం వెలిగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?

ప్రతిరోజూ కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల మీ మనసు, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం వెలిగించడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇంట్లోకి దోమలు, చీమలు రావు. శ్వాస సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం.

New Update
Camphor Lamp: ఇంట్లో కర్పూర దీపం వెలిగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?

Camphor Lamp: మీ ఇంట్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడమే కాకుండా ఎన్నో మార్పులు జరుగుతాయి. గుడికి వెళ్లినప్పుడల్లా మన మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ దీనికి కారణం. దానికి తోడు గంధం, కర్పూరం సువాసనలు కూడా ఆలయాల్లో ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి వాతావరణాన్ని తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల మీ మనసు, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

గాలి స్వచ్ఛంగా మారుతుంది:

  • ఇంట్లో మనం పీల్చే గాలి పూర్తిగా శుభ్రంగా ఉండదు. అందులో మనకు రోగాలను తెచ్చిపెట్టే అనేక క్రిములు తిరుగుతూనే ఉంటాయి. కానీ కర్పూరంలో అపారమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఇంట్లో కర్పూరం వెలిగించడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. కర్పూరాన్ని సహజ క్రిమి నాశిని అని చెప్పవచ్చు. ఇంట్లో రోజూ కర్పూరాన్ని వెలిగించడం వల్ల దోమలు, చీమలు ఇంట్లోకి రావు.

శ్వాస సమస్య పరిష్కారం:

  • కర్పూరాన్ని ఇంట్లో వెలిగించడం వల్ల ఆస్తమా లేదా శ్వాస సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం కలుగుతుందని నిపుణులు అంటున్నారు. కర్పూరం నుంచి వచ్చే చిన్న పొగ కారణంగా ముక్కు, ఛాతీ ఫ్రీ అవుతాయని చెబుతున్నారు.

మానసిక ఒత్తిడి, ఆందోళన దూరం:

  • కర్పూర పరిమళం మనసులో ఒక రకమైన ఆనందాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, టెన్షన్ నుంచి చాలా ఉపశమనం లభిస్తుంది. కర్పూర వాసన శారీరక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

ఇంట్లో ఎప్పుడూ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది:

  • కర్పూరానికి మిమ్మల్ని దైవత్వం వైపు ఆకర్షించే శక్తి ఉంది. కాబట్టి ఇంట్లోని సభ్యులందరి మనసుల్లో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు మీరు ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించాలని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉండదని, ఎప్పుడూ పాజిటివ్‌గా ఉంటారని చెబుతున్నారు.
    కీటకాలను దూరంగా ఉంచుతుంది.

ఇది కూడా చదవండి: ఇనుప వస్తువుల తుప్పు ఇలా వదిలించేయవచ్చు..మళ్ళీ కొత్తగా అయిపోతాయి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
తాజా కథనాలు