Bhuchakragadda: భూచక్రగడ్డ ఇది ఎక్కువగా అటవీప్రాంతంలో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో చాలా చోట్ల రోడ్లపై దీన్ని అమ్ముతున్నారు. చాలా మంది దీన్ని తినేందుకు ఇష్టపడరు. కానీ రాముడు వనవాసానికి వెళ్లి అరణ్యంలో ఉన్నప్పుడు శరీరాన్ని దృఢంగా ఉంచుకోవడానికి ఈ దుంపను తిన్నాడని చెబుతుంటారు. ఇది నిజమో కాదో కానీ ఈ భూచక్రగడ్డలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్నది మాత్రం నిజం. ఈ దుంప చూసేందుకు గుండ్రంగా ఉంటుంది. చుట్టూ వదిలేసి మధ్యలో ఉన్న భాగాన్ని మాత్రమే తినేందుకు ఉపయోగిస్తారు. దీన్ని తినడం వల్ల కిడ్నీలకు మేలు జరుగుతుందని చెబుతున్నారు. అంతే కాకుండా ఇందులో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఇది ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. కేవలం 20 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
- కడుపు సంబంధిత రుగ్మతలు, అజీర్ణ సమస్యలను పరిష్కరించే సామర్ధ్యం ఈ భూచక్రగడ్డలో ఉంది. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా జీర్ణక్రియకు కూడా చాలా మంచిదని నిపుణులు అంటున్నారు.
శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం:
- ఈ దుంపను క్రమం తప్పకుండా తీసుకుంటే శ్వాసకోశ సంబంధిత సమస్యలను నయం చేయవచ్చు. దీర్ఘకాలంగా ఆస్తమా సమస్యతో బాధపడేవారు దీన్ని తింటే మంచి ఉపశమనం కలుగుతుంది. కఫాన్ని కూడా తొలగిస్తుంది. ఈ దుంపలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి దీన్ని తరచుగా తింటే కీళ్లనొప్పులు, శరీరం లోపల, బయట వాపులు నయమవుతాయి.
రోగనిరోధక శక్తి:
- ఈ భూచక్రగడ్డలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది, శరీర బలహీనత నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపుతుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేకాకుండా కాలేయం, మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.
భూచక్రగడ్డను ఎలా తినాలి?
- దీన్ని పచ్చిగానే తినవచ్చు. లేకుంటే సన్నగా తరిగి నిమ్మరసం పిండుకుని, మసాలా రాసుకుని తీసుకోవచ్చు. ఇది చాలా తేలికపాటి తీపి కలిగి ఉంటుంది. బీట్‌రూట్‌తో కలిపి కూడా తీసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: తాటిముంజల లాభాలు తెలుసా?..వేసవిలో ఎంతో ఉపయోగకరం
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.