Red Asparagus benefits: ఎర్ర తోటకూరతో ఎన్నో ప్రయోజనాలు.. జీర్ణ సమస్యలకు చెక్

ఆకు కూరలు మన ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. అత్యంత పోషకాలు ఉన్న ఆకు కూరలలో తోటకూర ఒకటి. ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. జీర్ణ సమస్యలకు చెక్ పెడతాయి.

New Update
Red Asparagus benefits: ఎర్ర తోటకూరతో ఎన్నో ప్రయోజనాలు.. జీర్ణ సమస్యలకు చెక్

Red Asparagus benefits: సాధారణంగా ఆకు కూరలు ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతారు. ఆకు కూరల్లో ఎన్నో పోషకాలున్నాయి. అందుకే ఆహారంలో ఆకు కూరలను తీసుకోవాలంటి చెబుతుంటారు. ఆకుకూరల్లో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో రకాలుగా ప్రయోజనాలు ఇస్తుంది. అత్యంత పోషకాలు ఉన్న ఆకు కూరలలో ఎర్రతోటకూర ఒకటి. అయితే ఈ తోటకూరలో ప్రధానంగా ఆకుపచ్చ, ఎరుపు తోటకూర అనే రెండు రకాలు ఉన్నాయి. తోటకూరతో పోలిస్తే ఎర్ర తోటకూర (Red Asparagus)లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. రోజూ ఎర్ర తోటకూర తింటే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలేంటో ( health benefits) ఇక్కడ తెలుసుకుందాం.

ఎర్ర తోటకూర అంటే కలిగే ప్రయోజనాలు:

  • ఎర్ర తోటకూరలో విటమిన్-ఏ, సి, ఈ, బి, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్ఫరస్,ప్రోటీన్, మాంగనీస్, ఐరన్, కాపర్, జింక్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వారంలో కనీసం రెండుసార్లు ఈ ఆకుకూరను తింటే హెల్త్‌కి మంచిది.
  • రక్తంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ పెంచడంలో ఎర్ర తోటకూర బాగా పనిచేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్నవారు ఆహారంలో ఎర్ర తోటకూర తింటే మంచిది.
    ఎర్ర తోటకూర జీర్ణ సమస్యలను సులభతరం చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను, మలబద్ధకం,గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం చేయడానికి సహాయపడుతుంది.
  • కంటి ఆరోగ్యానికి ఎర్ర తోటకూర చాలా మంచిది. కంటి చూపు, కంటి,చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, రక్తాన్ని శుద్ధి చేయడానికి ఎర్ర తోటకూర ఎంతగానో ఉపయోగపడుతుంది.
  • వృద్ధాప్య లక్షణాలను దూరం చేసి.. చర్మంపై ముడతలు, మొటిమలను పొగొట్టి ముఖాన్ని అందంగా కాంతివంతంగా ఉండేలా ఎర్ర తోటకూర చేస్తుంది.
    మన శరీరంలో అనేక ఆరోగ్య సమస్యలు, వ్యాధుల నుంచి దూరం చేసి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఎర్ర తోటకూర బెస్ట్‌ ఆహారం. ఎర్ర తోటకూర విటమిన్-సి, రోగనిరోధక వ్యవస్థను పెచుతుంది.

ఇది కూడా చదవండి: రావి చెట్టుతో ఎన్నో సమస్యలకు పరిష్కారం.. ఈ చిట్కాలు తెలుసుకుంటే అంతా ఆనందమే!

Advertisment
Advertisment
తాజా కథనాలు