/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Peddapally-district-was-not-a-suicide-but-a-murder-in-Manthani-Madhudi-jpg.webp)
నింధితులను కఠినంగా శిక్షించాలి
పెద్దపల్లి జిల్లా మంథని మధుకర్ మృతి కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం మంథని ప్రెస్ క్లబ్‌లో మంథని మధుకర్ తల్లి తండ్రులతో కలిసి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ మంథని మండలం ఖానాపూర్ గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన దళిత యువకుడైన మంథని మధును 2017లో హత్య చేసిన విషయాన్ని, కొంతమంది జిల్లా అధికారులు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. దీనిని పూర్తిగా ఖండిస్తున్నాం అని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మంథని మధు ఉదంతంపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి, నిందితులను వేగంగా గుర్తించి శిక్షించాలని డిమాండ్ వారు చేశారు. మంథని మధు ఘటనపై రాష్ట్ర హైకోర్టు ఈనెల 31లోపు రీకౌంట్ దాఖలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. అయినా జిల్లా అధికారులు కేసు విషయంలో నిమ్మకు నీరు ఎత్తినట్లు వ్యవహరించడం సరికాదని మండిపడ్డారు. మధు ఆత్మహత్య చేసుకున్నాడని కొంతమంది ఆరోపణ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకుంటే అతని శరీరంపైన గాయాలు ఎందుకు ఉంటాయి..? అని ప్రశ్నించారు.
శిక్ష పడేలా చేయాలి..
బీఆర్ఎస్ ప్రభుత్వానికి నిజంగా దళితులపైన ప్రేమ ఉంటే మంథని మధు కేసు విషయంలో నిందితులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. మంథని మధు కుటుంబాన్ని ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మంథని మధుకర్ అన్నయ్య సమ్మయ్య మాట్లాడుతూ.. కొంతమంది మా తమ్ముడి కేసు విషయంలో హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టినట్లు మాకే సమాచారం లేదన్నారు. నిజంగా హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ పెట్టిన వారికి మాపైన ప్రేముంటే మాతమ్ముని కేసు విషయంలో నిందితులను త్వరగా గుర్తించాల అన్నారు. నింధితులపై చర్యలు తీసుకోని, కఠినంగా శిక్ష పడేలా చేయాలని అంతే తప్ప, సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదని అన్నారు.
ఈ కార్యక్రమంలో మంథని మధుకర్ తల్లిదండ్రులు మంథని లచ్చమ్మ, మంథని ఎల్లయ్య, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కందుకూరి రాజరత్నం పాల్గొన్నారు.