/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-25T161619.808.jpg)
Manjummel Boys Producer On Guna Song Copy Right Issue : 'మంజుమ్మల్ బాయ్స్' (Manjummel Boys) చిత్ర నిర్మాణ సంస్థకు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా (Ilaiyaraaja) ఇటీవల లీగల్ నోటీసులు పంపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అప్పట్లో ఇళయరాజా కంపోజ్ చేసిన గుణ సినిమాలోని కమ్మని ఈ ప్రేమ లేఖనే రాసింది హృదయమే..’ పాటను క్లైమాక్స్‌లో ఉపయోగించారు.
దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఇళయరాజా తన అనుమతి లేకుండా ఈ పాటను తమ సినిమాలో వాడుకున్నారని ‘మంజుమ్మల్ బాయ్స్’ చిత్ర నిర్మాణ సంస్థకు తన తరఫు న్యాయవాదితో లీగల్ నోటీసులు పంపారు. సినిమాలో పాటను ఉపయోగించాలంటే కచ్చితంగా సంగీత దర్శకుడి దగ్గర అనుమతి తీసుకోవాలని, లేదంటే కాపీరైట్‌ను ఉల్లంఘించినట్లేనని నోటీసులో పేర్కొన్నారు.
ఆ మ్యూజిక్ కంపెనీ నుంచి హక్కులు కొన్నాం
తాజాగా దీనిపై మంజుమ్మల్ బాయ్స్ నిర్మాత స్పందిస్తూ.. మేము గుణ సినిమా మ్యూజిక్ కంపెనీ (Guna Music Company) నుండి హక్కులు కొనుగోలు చేసిన తర్వాతే మా సినిమాలో వాడుకున్నాం. ఈ పాటకు ఓనర్లు అయిన శ్రీదేవి సౌండ్స్, పిరమిడ్ సంస్థల నుండి మేము హక్కులు పొందాము.. అని క్లారిటీ ఇచ్చాడు.
మరోవైపు ఇదే విషయం లో ఇళయరాజా పై సోషల్ మీడియా (Social Media) అంతటా ట్రోలింగ్ నడుస్తుంది. ఇక తాజాగా నిర్మాత ఇచ్చిన క్లారిటీతో నెటిజన్స్ ఇళయరాజాపై అసహనం వ్యక్తం చేస్తూ 'ఇలా చేసి ఉన్న మంచి పేరు ఎందుకు చెడగొట్టుకుంటున్నారని', మీలాంటి సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ప్రశ్నిస్తున్నారు..
Also Read : ప్రభాస్ ‘బుజ్జి’ని నడిపిన నాగ చైతన్య.. వైరల్ అవుతున్న వీడియో!