Manipur Violence : మణిపూర్ లో ఆగని హింస..తాజా దాడుల్లో ఐదుగురు పౌరులు మృతి! మణిపూర్ లో మరోసారి హింస చెలరేగింది. గుర్తు తెలియని దుండగులు ఐదుగురు మణిపూర్ పౌరులను కాల్చి చంపినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల క్రితం జరిగిన కాల్పుల్లో బీఎస్‌ఎఫ్ జవాన్ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. By Bhavana 19 Jan 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Manipur : మణిపూర్(Manipur) లో తాజాగా హింస(Violence) చెలరేగింది. రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను(Civilians) గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. ఈ విషయాన్ని పోలీసులు మీడియాకి తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బిష్ణుపూర్ జిల్లాలోని నింగ్‌తౌఖోంగ్ ఖా ఖునౌలో నలుగురు పౌరులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అలాగే కాంగ్‌పోక్పి జిల్లా కాంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్ లో మరో వ్యక్తిని సాయుధ దుండగులు కాల్చి చంపారు. బిష్ణూపూర్(Bishnupur) జిల్లాల్లో నలుగురు వ్యక్తులను కాల్చి చంపిన వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసు అధికారులు వివరించారు. మృతి చెందిన వారిని అంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఒకే కుటుంబానికి.. మృతుల్లో బమోంజావో సింగ్ అనే 61 సంవత్సరాల వ్యక్తి ఉండగా అతని కుమారుడు మణితోంబ సింగ్ (32) కూడా ఉన్నాడు. వీరితో పాటు తియం సోమేంద్ర సింగ్ (55) , నింగ్‌థౌజం నబద్విప్ సింగ్(40) అనే వ్యక్తులను గుర్తు తెలియని వ్యక్తులు గురువారం రాత్రి కాల్చి చంపారు. కాంగ్‌పోక్పిలో మరణించిన పౌరుడిని థియం కొంజిన్‌కు చెందిన తఖెల్లంబమ్ మనోరంజన్‌గా గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కంగ్‌చుప్ చింగ్‌ఖాంగ్ సమీపంలోని బంకర్ హిల్స్ నుండి మనోరంజన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.బుధ, గురువారాల మధ్య రాత్రి సాయుధ దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో అతడు మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బుధవారం రాత్రి, తౌబల్ జిల్లాలోని ఖంగాబోక్ వద్ద ఒక గుంపు వారిపై కాల్పులు జరపడంతో ముగ్గురు సరిహద్దు భద్రతా దళం సిబ్బందికి బుల్లెట్ గాయాలు అయ్యాయి. Also read: అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి చిత్రం ! #police #manipur #violence #5-civiliance #bishnupur మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి