మణిపూర్ లో భారత్ ను బీజేపీ హత్య చేసింది.... లోక్ సభలో రాహుల్ గాంధీ ఫైర్... !

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత మాతను అధికార పార్టీ హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మణిపూర్ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ రెండుగా విభజించిందని ఫైర్ అయ్యారు. మన ప్రధాని మోడీ మణిపూర్ లో కనీసం ఒక్క సారి కూడా పర్యటించలేదన్నారు.

author-image
By G Ramu
మణిపూర్ లో భారత్ ను బీజేపీ హత్య చేసింది.... లోక్ సభలో రాహుల్ గాంధీ ఫైర్... !
New Update

లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్బంగా ప్రధాని మోడీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. భారత మాతను అధికార పార్టీ హత్య చేసిందని తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మణిపూర్ రాష్ట్రాన్ని మోడీ సర్కార్ రెండుగా విభజించిందని ఫైర్ అయ్యారు. మన ప్రధాని మోడీ మణిపూర్ లో కనీసం ఒక్క సారి కూడా పర్యటించలేదన్నారు.

లోక్ సభలో బుధవారం ఆయన మాట్లాడుతూ... మొదట తన లోక్ సభ సభ్యత్వాన్ని పునరుద్దరించిన స్పీకర్ కు ధన్యవాదాలు తెలిపారు. గత సమావేశాల్లో తాను అదానీ గురించి మాట్లాడానన్నారు. దాంతో చాలా మంది బాధపడ్డారని అన్నారు. దానికి క్షమాపణలు చెబుతున్నానన్నారు. కానీ తాను సత్యమే మాట్లాడనన్నారు. ఈ సారి బీజేపీ నేతలు భయపడాల్సిన పనిలేదన్నారు. ఈ సారి తాను అదానీ గురించి మాట్లాడాలటం లేదన్నారు.

ప్రధాని మోడీ దృష్టిలో మణిపూర్ భారత్ లో లేదన్నారు. మణిపూర్ లో మదర్ ఇండియా మరణించిందన్నారు. మణిపూర్ లో భారత్ ను బీజేపీ హత్య చేసిందన్నారు. ఇప్పుడు హర్యానాను కూడా తగులబెట్టాలని చూస్తోందన్నారు. దేశం మొత్తాన్ని తగుల బెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తోందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఇద్దరు తల్లులు వున్నారని చెప్పారు.

అందులో ఒకరు(సోనియా గాంధీ) ఇక్కడ కూర్చుని వున్నారని పేర్కొన్నారు. హిందూస్థాన్ తనకు మరో తల్లి అని అన్నారు. తన తల్లి భారత మాతను మీరు చంపేశారంటూ మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మణిపూర్ లో ఇటీవల పర్యటించన సందర్బంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అక్కడ ఓ మహిళను కలిశానని, అక్కడ ఆమె చెప్పిన మాటలు విని తాను తీవ్ర ఆవేదనకు లోనయ్యానన్నారు.

తన కండ్ల ముందే తన చిన్న కొడుకును కాల్చి వేశారని, ఆ శవంతో పాటే రాత్రంతా ఇంట్లో వున్నానని ఆ మహిళ చెప్పిందన్నారు. తనకెంతో భయం వేసిందని, అందుకే తాను ఇళ్లు వడిచిపెట్టి వచ్చానని ఆ మహిళ తనతో చెప్పుకు ని బాధపడిందన్నారు. నీ వెంట ఏమైనా తెచ్చుకున్నావా అని ఆమెను అడిగానన్నారు. దానికి ఆమె కేవలం బట్టలు మాత్రమే తెచ్చుకున్నానని చెప్పగానే తనకు కండ్లలో నీళ్లు తిరిగాయన్నారు.

ప్రధాని మోడీ కేవలం అమిత్ షా, గౌతమ్ అదానీ మాటలను మాత్రమే వింటారని చెప్పారు. రావణుడు కదా ఇద్దరి మాటలు విన్నట్టు మోడీ కూడా కేవలం ఆ ఇద్దరి మాటలు మాత్రమే వింటారన్నారు. తన భారత్ జోడో యాత్ర ముగియలేదేన్నారు. యాత్ర సందర్బంగా తాను నిజమైన భారత దేశాన్ని చూశానని వెల్లడించారు. యాత్ర సమయంలో పేదల బాధలను తాను అర్థం చేసుకున్నానని వివరించారు.

#rahul-gandhi #modi #lokesabha #no-trust-motion #maninpur #barathmatha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి