Manipur : పోలీసుల కళ్ళెదుటే.. మణిపూర్ మహిళల ఘటన

గత ఏడాది జరిగిన మణిపూర్ మహిళలను నగ్నంగా ఊరేగించడం...దాని తర్వాత జరిగిన హింస ఎంత సంచలనం రేపాయో అందరికీ తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి సీబీఐ ఛార్జ్‌షీట్‌లో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. పోలీసుల కళ్ళెదుటే అంతా జరుగుతున్నా వారు ఏమీ చేయలేదని తెలుస్తోంది.

New Update
Manipur : పోలీసుల కళ్ళెదుటే.. మణిపూర్ మహిళల ఘటన

Manipur Women's : మణిపూర్(Manipur) కుకీ మహిళల లైంగిక హింస(Sexual Violence Against Women) దేశం అంతా కలకలం రేపింది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేంగిచిన సంఘటన దేశానికే మచ్చలా మిగిలింది. మైతీ తెగకు చెందిన అల్లరి మూకలు ఈ పనిని చేశాయి. ఆ తర్వాత కూడా చాలా రోజులు మణిపూర్‌లో హింసలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఆ రోజు మహిళలను నగ్నంగా ఊరేగించిన రోజు పోలీసులు అక్కడే ఉన్నారని... అయినా కూడా వారు కుకీ స్త్రీలకు సహకరించకుండా చూస్తూ ఉండిపోయారని... సీబీఐఈ(CBIE) చెబుతోంది. పోలీసులు మహిళలను ఏ మాత్రం పట్టించుకోకుండా..అల్లరి గుంపుకే సపోర్ట్ చేశారని ఛార్జ్‌ షీట్‌లో తెలిపింది.

మైతీ అల్లరి మూక కాంగ్‌పోకి జిల్లాలో అటాక్ చేసినప్పుడు బాధిత మహిళలతో పాటూ మరికొందరు అడవుల్లోకి పారిపోయారు. అక్కడ వారికి పోలీసులు కనిపించారు. తమ మీద మైతీ గ్రైప్ దాడి చేస్తున్నారని... కాపాడాలని ప్రాధేయపడ్డారు. ఇద్దరు మహిళలతో పాటూ ఒక కుకీ వ్యక్తి కూడా జీపులో దాక్కున్నారు కూడా. అయితే పోలీసులు మాత్రం వానికి ఏమీ స్పందించలేదు. పైగా జీపు తాళాలు లేవని కూడా చెప్పారు. తర్వాత స్వయంగా పోలీసులే వారిని జీపులో తీసుకెళ్ళి మైత్రీ అల్లరి మూకకు బాధితులను అప్పగించారని సీబీఐ తన చార్జ్‌ షీట్‌లో పేర్కొంది. దాని తర్వాతనే అల్లరి మూక మహిళలను నగన్నంగా ఊరేగించి..పొలాల్లోకి తీసుకెళ్ళి సామూహిక అత్యాచారానికి కూడా పాల్పడ్డారని చెప్పింది.ఇదంతా పోలీసుకు తెలిసినా ఏమీ చేయలేదని తెలిపింది.

మామూలుగా అయితే మైతీ గ్రూపుకు ముగ్గురు మహిళలు చిక్కారు. అందులో ఒకరు కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న ఒక జవాన్ భార్య కూడా ఉన్నారు. అయితే ముగ్గురిలో ఒక మహిళ చివరి నిమిషంలో త్రుటిలో తప్పించుకుని పారిపోగా...ఇద్దరు మాత్రం మైతీ గ్రూప్‌కు చిక్కి చిత్రహింసలకు గురయ్యారు. గతేడాది మే4న ఈ సంఘటన జరిగింది. దీనిలో ఆరుగురు నిందితుల మీద ఛార్జ్‌ షీట్ ఫైల్ అయింది. వీరు కాక ఒక బాల నేరస్థుడి మీద కూడా గౌహతి సీబీఐ ప్రత్యేక జడ్జి కోర్టులో అక్టోబరు 16న ఛార్జ్‌ షీట్ దాఖలు అయింది.

Also Read:Kota: కోటాలో మరో నీట్ విద్యార్థి ఆత్మహత్య..48 గంటల్లో రెండోది!

Advertisment
Advertisment
తాజా కథనాలు