/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-28T183910.309-jpg.webp)
Mangalavaram Movie: ఆర్ఎక్స్ 100' ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన చిత్రం 'మంగళవారం'. ఈ సినిమాలో పంజాబీ ముద్దుగుమ్మ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా ప్రధాన పాత్రలో నటించింది. గతేడాది నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి ప్రశంసలను దక్కించుకుంది. ఆ తర్వాత ఓటీటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు టీవీ ఫార్మాట్ లోనూ సత్తాచాటింది 'మంగళవారం'.
Also Read: RaviTeja Venky: రవితేజ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. ‘వెంకీ’ రీ రిలీజ్.. ఎప్పుడంటే?
టీవీ ఫార్మాట్ లో కూడా సత్తాచాటిన మంగళవారం
థియేటర్, ఓటీటీలో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న 'మంగళవారం' సినిమా.. టీవీలో ఫార్మాట్ లో కూడా అదిరిపోయే రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తాజాగా స్టార్ మా ఛానెల్ లో ప్రసారమైన ఈ చిత్రం అత్యధిక TRP 8.3 రేటింగ్ నమోదు చేసింది. సాధారణంగా టీవీల్లో స్టార్ హీరోల చిత్రాలకే ఇలాంటి నంబర్స్ రావడం రేర్ గా జరుగుతుంది. అలాంటిది ఏ అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రానికి .. ఈ స్థాయి ప్రేక్షకాదరణ దక్కడం విశేషమనే చెప్పాలి. ఈ విషయాన్నీ వెల్లడిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశాయి సినీ వర్గాలు. "Rustic and Realistic Hit On Television" అంటూ ట్విట్టర్ లో పోస్టర్ రిలీజ్ చేశారు.
#mangalavaram First time Trp pic.twitter.com/WoDnnwQzHx
— Cinema Aura (@CinemaAura) February 27, 2024
తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ముద్ర మీడియా బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, సురేష్ వర్మ నిర్మించారు. ఇటీవలే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండబోతున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రియదర్శి, నందిత శ్వేతా, అజయ్ గోష్, దివ్య పిళ్ళై ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు.
Also Read: Bubblegum Song: రోషన్ కనకాల బబుల్ గమ్..’ఈజీ పీజీ’ లిరికల్ సాంగ్ వీడియో