Manchu Vishnu: భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?

టాలీవుడ్ హీరో మంచు విష్ణు 15వ పెళ్లిరోజు సందర్భంగా భార్య విరానికకు అదిరిపోయే సర్ ప్రైజ్ ఇచ్చారు. హెలికాఫ్టర్ లో ఆమెను తీసుకెళ్లి స్పెషల్ గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరలవుతుంది.

New Update
Manchu Vishnu: భర్త అంటే ఇలా ఉండాలి .పెళ్లి రోజు గిఫ్ట్ గా భార్యని మంచు విష్ణు ఎలా సప్రైజ్ చేశాడంటే..?

Manchu Vishnu: ఒకప్పుడు పెళ్లి రోజు, పుట్టినరోజులు అంటే సింపుల్ గా ఫ్యామిలీతో కలిసి సెలెబ్రేట్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. లైఫ్ లో ప్రతీ ఈవెంట్ చాలా స్పెషల్ గా, సర్ ప్రైజింగ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ హీరో మంచు విష్ణు కూడా అలాంటిదే చేశారు. పెళ్లి రోజు సందర్భంగా భార్య కోసం అదిరిపోయే సర్ ప్రైజ్ ప్లాన్ చేశారు.

హీరో మంచు విష్ణు ప్రస్తుతం "భక్త కన్నప్ప" సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యామిలీ టైం కేటాయిస్తుంటారు మంచు విష్ణు. అప్పుడప్పుడు తన వైఫ్, పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు.

publive-image

భార్యకు మంచు విష్ణు సర్ ప్రైజ్

అయితే తాజాగా మంచు విష్ణు తన 15వ పెళ్లిరోజు సందర్భంగా భార్య విరానికకు అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు. హెలికాఫ్టర్ లో ఆమెను తీసుకెళ్లి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను విరానికా తన సోషల్ మీడియా వేదిక షేర్ చేశారు. "ఇంత అందమైన సర్ ప్రైజ్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. దీన్ని నువ్వు ఎంతో అందంగా ప్లాన్ చేశావు అంటూ భర్తకు థ్యాంక్స్ చెబుతూ పోస్ట్ పెట్టింది విరానిక. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇది చూసిన అభిమానులు మంచు విష్ణు, విరానిక దంపతులకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ.. కామెంట్స్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Viranica Manchu (@viranica)

Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. ‘హరిహర వీరమల్లు’ నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు