Manchu Vishnu : మనోజ్ కూతురి బారసాలలో కనిపించని మంచు విష్ణు.. గొడవలే కారణమా?

మంచు మనోజ్ తాజాగా కూతురి బారసాల వేడుక నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ వేడుకలో మంచు విష్ణు ఎక్కడా కనిపించలేదు. కూతురిపేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్‌లోనూ విష్ణు పేరు ఎక్కడా లేకపోవడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు కొనసాగుతున్నాయని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.

New Update
Manchu Vishnu : మనోజ్ కూతురి బారసాలలో కనిపించని మంచు విష్ణు.. గొడవలే కారణమా?

Manchu Vishnu Missing In Manoj Daughter Naming Cermony : టాలీవుడ్ హీరో మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు ఏప్రిల్ 13న ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మనోజ్ తన ముద్దుల కూతురికి నిన్న నామకరణం చేశారు. తన కూతురికి ‘దేవసేన శోభ MM' అని పేరు పెట్టారు. ఈ పేరును పెట్టడం వెనుక ఉన్న కారణాన్ని కూడా తెలిపారు. "పరమేశ్వరుడి భుక్తులమైన మేము ఆ శివుని కుటుంబంలో సుబ్రహ్మణ్య స్వామి సతీమణి పేరు నుంచి ‘దేవసేన’, మా అత్తగారు శ్రీమతి శోభా నాగిరెడ్డి పేరు నుంచి శోభ కలిసి వచ్చేలా మా పాపకు 'దేవసేన శోభ' అని నామకరణం చేశామని" తెలిపారు.

Also Read : రెండు భాగాలుగా సూర్య ‘కంగువ’.. కన్ఫర్మ్ చేసిన నిర్మాత, అప్పుడే పార్ట్-2 షూటింగ్ కూడా!

ఈ నామకరణ వేడుకకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అందులో మనోజ్‌ సోదరుడు, హీరో మంచు విష్ణు కనిపించనేలేదు. అలాగే చిన్నారి పేరును ప్రకటిస్తూ విడుదల చేసిన నోట్‌లోనూ విష్ణు పేరు ఎక్కడా లేదు. పేరెంట్స్‌ మోహన్‌బాబు- నిర్మలాదేవి, సోదరి మంచు లక్ష్మి పేర్లతో పాటు మౌనిక సోదరులు అఖిల, విక్యంత్‌ పేర్లను సైతం ప్రస్తావిస్తూ కృతజ్ఞత చెప్పిన మనోజ్‌.. తన అన్న పేరును మాత్రం వదిలేశాడు. దీంతో మంచు ఫ్యామిలీ ఇంట గొడవలు ఆగిపోలేదని, విష్ణు - మనోజ్‌ మధ్య మనస్పర్థలు అలాగే కొనసాగుతున్నాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Advertisment
తాజా కథనాలు