/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T165311.893-jpg.webp)
Ram Charan: సినిమాల్లో మాత్రమే కాదు నిజం జీవితంలో హీరోలే అన్నట్లుగా ఉంటారు కొంతమంది స్టార్ హీరోలు. వారిలో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. తమను అభిమానించే వారి కోసం సేవా కార్యక్రమాలు, కష్టాల్లో ఉన్నవారికి సహాయపడడం వంటి పనులు చేస్తూ ఎప్పటికప్పుడు తన గొప్ప మనసును చాటుకుంటారు. అయితే తాజాగా చరణ్ చేసిన మరో గొప్ప సహాయం బయటకు వచ్చింది.
మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గ్రాండ్ గా ఈవెంట్ ను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోలు, దర్శకనిర్మాతలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో పాల్గొన్న మంచు మనోజ్.. రామ్ చరణ్ గొప్ప మనసు గురించి మాట్లాడిన మాటలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అసలు మనోజ్ చరణ్ గురించి ఏమ్మన్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T165514.182-jpg.webp)
కేవలం నిమిషంలో 5 లక్షలు పంపించాడు చరణ్
మనోజ్ మాట్లాడుతూ.. "కష్టాల్లో ఉన్నవారికి సహాయం చేయడానికి చరణ్ ఎప్పుడు ముందుంటాడు. 2018 లో నేను అమెరికాలో ఉన్న సమయంలో.. సహాయం కావాలని నాకొక ఫోన్ వచ్చింది. ఓ ఆడబిడ్డ ఇమిగ్రేషన్ సమస్యతో దుబాయిలో చిక్కుకుపోయిందని 5 లక్షలు సహాయం కావాలని ఫోన్ చేశారు. కానీ ఆ సమయంలో నాతో అంత డబ్బులు లేకపోవడంతో.. అర్ధరాత్రి రామ్ చరణ్ కు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఆడబిడ్డకు కష్టం ఉందని చెప్పగానే నిమిషం కూడా ఆలోచించకుండా డబ్బులు పంపించాడు అంటూ చరణ్ గొప్ప మనసు గురించి తెలియజేశాడు". ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-2024-03-29T165758.820-jpg.webp)
ఇంకా ఇలా అన్నారు.. చరణ్ తన ప్రాణ స్నేహితుడని. అలాంటి మిత్రుడి బర్త్ డే ఈవెంట్ కు రావడం ఆనందంగా ఉందని. చిన్నతనం నుంచి చరణ్ ఇప్పటికీ అలాగే ఉన్నాడు. ఈ కాలంలో ఇలాంటి స్నేహం దొరకడం కష్టమని తెలిపారు. అందరూ స్థాయి పెరిగిన తర్వాత కొత్త ఫ్రెండ్స్ తో బిజీ అయిపోతారు. కానీ చరణ్ మాత్రం అలా కాదు అని వారిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి చెప్పుకొచ్చారు.
Also Read: Deepthi Sunaina: మరో సారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా..? ఎవరో తెలుసా..?
Follow Us