Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్

టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి ప్రేమించుకుని, పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. ఈ జంట శుభవార్త చెప్పింది. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నానంటూ మంచు మనోజ్ పేర్కొన్నారు.

Manchu Manoj: తండ్రి కాబోతున్న మంచు మనోజ్
New Update

Manchu Manoj: టాలీవుడ్ యాక్టర్ మంచు మనోజ్, భూమా నాగ మౌనిక రెడ్డి ప్రేమించుకుని, పెళ్లితో ఒకటైన విషయం తెలిసిందే. అయితే, ఈ జంట శుభవార్త చెప్పింది. మౌనిక తల్లి శోభా నాగిరెడ్డి జయంతి సందర్భంగా మంచు మనోజ్ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని అభిమానులతో చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నానంటూ మంచు మనోజ్ పేర్కొన్నారు. ఇది తమకు సంతోషకరమైన సమయమని, అందరి ఆశిస్సులూ తమకు కావాలని ట్వీట్ లో కోరాడు.

చాలాకాలం పాటు వెండితెరకు దూరంగా ఉన్న మనోజ్ పెళ్లయ్యాక మళ్లీ స్క్రీన్ మీద కనిపించారు. సినిమాలతో పాటు, బుల్లితెర షోలతో బిజీ అయిపోయాడిప్పుడు.

‘‘అత్తమ్మా... నువ్వు, భూమా నాగిరెడ్డి మామ ఇంకొకసారి అమ్మమ్మ, తాతయ్యలు అయ్యారు. చిన్నారి ధైరవ్ అన్న అవుతున్నాడు.. మీ ఆశీస్సులు మాకు ఎప్పుడూ ఉంటాయి’’ అంటూ మనోజ్ ఎమోషనల్ గా ట్వీట్ చేశారు. ‘‘మా అమ్మ నిర్మల, నాన్న మోహన్ బాబు ఆశీర్వాదాలతో కుటుంబ ప్రేమాభిమానాలను ఆస్వాదిస్తున్నాం" అని తన ట్వీట్లో మనోజ్ పేర్కొన్నాడు.

#manchu-manoj #bhuma-naga-mounika
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe