Manchu Lakshmi : అమెరికా వెళ్ళాలి.. ఎవరైనా సాయం చేయండి - వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్!

మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. తనకు వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా దాన్ని పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరింది.

New Update
Manchu Lakshmi : అమెరికా వెళ్ళాలి.. ఎవరైనా సాయం చేయండి - వైరల్ అవుతున్న మంచు లక్ష్మి పోస్ట్!

Manchu Lakshmi: టాలీవడ్ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఇన్ స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ఈమె.. ఈ మధ్య గ్లామర్ షోతో అదరగొడుతుంది. హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని విధంగా స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి నేటిజన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే తాజాగా ఈ నటి పెట్టిన ఓ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ లో నెటిజన్స్ ను సాయం అడగడం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే...

తనకు వీసా అప్రూవ్‌ అయినా దాన్ని ఇంకా దాన్ని పొందలేదని, ఆ సమస్యకు పరిష్కారం చూపాలంటూ మంచు లక్ష్మి తాజాగా సోషల్‌ మీడియా వేదికగా అభిమానులను కోరింది. ఈ మేరకు తన పోస్ట్ లో.." అమెరికా సిటిజన్‌ అయిన నా కుమార్తె స్కూల్‌ హాలీడేస్‌ త్వరలోనే ముగియనున్నాయి. ఈ నెల 12న మేం అక్కడకు వెళ్లాల్సి ఉంది. ఎంబసీ (రాయబార కార్యాలయం) వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.

Also Read : హీరో రాజ్‌తరుణ్‌పై లవర్‌ లావణ్య సంచలన ఆరోపణలు.. పెళ్లి చేసుకుంటానని, వదిలేసి వెళ్లిపోయాడంటూ!

సాయం చేయండి...

వారిని సంప్రదించేందుకు నాకు మార్గం లేకుండా పోయింది. వీసా జారీ అయి నెలకుపైనే అయినా దాన్ని చేరవేయడంలో జాప్యం చోటుచేసుకుంది. ఎవరైనా హెల్ప్‌ చేయగలరా?" అని అభ్యర్థించింది ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు నెటిజన్స్ స్పందిస్తూ తమకు తెలిసిన సమాచారం ఇవ్వగా.. మరికొందరు ఎక్‌నాలెడ్జ్‌మెంట్‌ తీసుకుని నేరుగా ఎంబసీకి వెళ్లండంటూ సలహా ఇస్తున్నారు.

#manchu-lakshmi #manchu-lakshmi-insta-post
Advertisment
తాజా కథనాలు