Mancherial District : యువకుడి ప్రాణం తీసిన లోన్‌యాప్.. ఉరేసుకొని ఆత్మహత్య మంచిర్యాలలో లోన్‌యాప్ నిర్వాహకుల వేధింపులు తట్టుకోలేక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీకాంత్(29) ఆర్థిక ఇబ్బందులతో లోన్‌యాప్‌లో రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా చెల్లించడం ఆలస్యం కావడంతో నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. మనస్థాపానికి గురైన శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. By Archana 25 Aug 2024 in క్రైం నల్గొండ New Update షేర్ చేయండి Loan App Harassment : ఈ మధ్య చాలా మంది యువత ఆర్ధిక సహాయం కోసం స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ , లోన్ యాప్స్ (Loan Apps) వంటి సోషల్ మీడియా (Social Media) ప్లాట్ ఫార్మ్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇక ఈ లోన్ యాప్స్ తీసుకున్న డబ్బులు తిరిగి కట్టలేక కొంతమంది ఇబ్బందులు కూడా పడుతుంటారు. ఇలా లోన్ యాప్ వేధింపులు తట్టుకోలేకే మంచిర్యాల జిల్లా (Mancherial District) లో ఆత్మహత్య చేసుకున్నాడు ఓ యువకుడు. ప్రాణం తీసిన లోన్ యాప్ శ్రీరాంపూర్ అరుణాక్కర్‌నగర్‌కు చెందిన నమ్తాబాజీ శ్రీకాంత్(29) అనే యువకుడు మంచిర్యాలలో సెల్ పాయింట్ నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఇతనికి భార్య, ఒక కుమారుడు ఉన్నాడు. అయితే మూడేళ్ళుగా శ్రీకాంత్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ట్రేడింగ్ చేస్తున్నాడు. మొదట్లో మంచి లాభాలు వచ్చాయి. దాంతో అలాగే ట్రేడింగ్ చేస్తూ వచ్చాడు. కానీ ఆ తర్వాత మెల్లి మెల్లిగా నష్టాలు వచ్చాయి. దీంతో ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఓ లోన్ యాప్ ద్వారా శ్రీకాంత్ రుణం తీసుకున్నాడు. ఒక నెల వాయిదా కట్టడం ఆలస్యం చేయడంతో లోన్ యాప్ నిర్వాహకులు వేధింపులకు గురిచేశారు. దీంతో మానసిక ఒత్తిడికి గురైన శ్రీకాంత్ ఇంట్లో ఎవరూ లేని సమయంలో తన బాధను సెల్ఫీ వీడియోలో వివరించి.. అనంతరం ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. Also Read: Kolkata Rape Accused: కోల్కతా హత్యాచారం కేసు.. నిందితుడు సంజయ్ రాయ్కు నేడు పాలిగ్రాఫ్ టెస్ట్! - Rtvlive.com #nalgonda #mancherial-district #loan-apps-harassment మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి