Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో!

ఈ రోజుల్లో జాబ్ చేయడం అత్యంత కష్టం అయిపోయింది. ఉద్యోగులు నానాపాట్లు పడుతున్నారు. జాబ్ నిలపడం కోసం రకరకాల ఫీట్లు చేస్తు్న్నారు. తాజాగా బెంగళూరులో బైక్‌ మీద వెళుతూ ల్యాప్ ట్యాప్‌ మీద పనిచేస్తునన వ్యక్తి వీడియో సోసల్ మీడియాలో వైరల్ అయింది.

Bengaluru: బైక్ డ్రైవ్ చేస్తూ ల్యాప్ టాప్ లో జూమ్ మీటింగ్.. వైరల్ అవుతోన్న బెంగళూరు ఐటీ ఉద్యోగి వీడియో!
New Update

Job kastalu: రాను రాను ఉద్యోగాలు చేయడం చాలా కష్టం అయిపోతోంది. కంఆపిటీషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా...లేక పొరపాటు జరిగినా అంతా తలకిందులు అయిపోతోంది. దీంతో ఉద్యోగం నిలుపుకోవడం కోసం నానా కష్టాలు పడుతున్నారు జనాలు. ఈ ఇండస్ట్రీ...ఆ ఇండస్ట్రీ అని తేడా లేకుండా అన్ని రకాల ఉద్యోగాల్లోనూ ఈ ప్రెజర్ ఉంది. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి అయితే చెప్పనలవి కాదు. వీడియో కాన్ఫరెన్స్‌లు, జూమ్ మీటింగులు...ఇలా లెక్కలేదు వాళ్ళ తలనొప్పులకు. దీంతో వాళ్లు ఎక్కడ పడితే అక్కడే పనులు చేస్తున్నారు.

బెంగళూరులో అయితే సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఇక్కడ విపరీతమైన జనాభా పెరిగిపోయారు. ఐటీ ఇండస్ట్రే డెవలప్‌మెంట్ కారణంగా దేవం మొత్తం జాలు ఇక్కడకు వచ్చే చేరారు. దాంతో బెంగళూరు రోడ్లు నిత్యం ట్రాఫిక్ కష్టాలతో అల్లల్లాడుతూ ఉంటుంది. దీంతో సమయానికి ఉద్యోగులు జాబ్స్‌కు అటెండ్ కాలేకపోతున్నారు.  దీని వలన దారి మధ్యలోనే కాల్స్ ఆన్సర్ చేయాల్సి వస్తోంది. తాజాగా ఓ ఉద్యోగి బైక్‌ మీద వెళుతూ కూడా ల్యాప్ ట్యాప్ ఓపెన్ చేసి ఆఫీస్ కాల్ అటెండ్ అయ్యాడు. సాధారణంగా కార్లలో వెళుతున్న వాళ్ళు ఈ పనిని ఎక్కువగా చేస్తారు. అయితే బైక్ మీద వెళుతూ చేయడం మాత్రం నిజంగానే వింతే. బైక్ డ్రైవింగే రిస్క్ అంటూ ఇలా ల్యాప్‌ట్యాప్‌లతో పని చేస్తూ డ్రైవింగ్ చేయడమంటే సాహసమనే చెప్పాలి. అయితే ఈ రిస్క్ అంతా కేవలం ఉద్యోగం నిలపుకోవడం కోసమే చేస్తున్నారు.

బైక్‌ మీద వెళుతూ ల్యాప్‌ట్యాప్‌లో పని చేస్తన్న వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతోంది. దీని కింద నెటిజన్లు కామెంట్లు చేస్తు్న్నారు. కొంతమంది ఉద్యోగాలు చేయడం ఇతం కష్టంగా ఉంటుందా అని అంటుంటే..రోడ్డు సేఫ్టీని అంత పట్టించుకోకుంఆ ఉండడం మంచిది కాదని సలహాలు ఇస్తున్నారు మరికొందరు. ఇంతలా కష్టపడం కంటే వేరే ఉద్యోగం వెతుక్కోవడం మంచిదని సలహాలు ఇస్తుననారు. ఏది ఏమైనా ఆ ఒత్తిడి ఏంటో జాబ్ చేస్తున్నవాడికే తెలుస్తుంది అనేది సత్యం.

Also Read:Tamil Nadu: నటి రాధికా శరత్‌ కుమార్‌ కు ఎన్ని కోట్ల అప్పు ఉందో తెలుసా? నామినేషన్ పత్రాల్లో సంచలన విషయాలు!

#bengaluru #bike #rider #lap-top
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe