Maharashtra: మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. ఎందుకంటే..?

తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Maharashtra: మంత్రిపై పసుపు చల్లిన వ్యక్తి.. ఎందుకంటే..?
New Update

Maharashtra: తమకు నచ్చని రాజకీయ నాయకులపై కోడి గుడ్లు, టమాలు, చెప్పులు విసరడం.. ఇంకు చెల్లడం వంటివి చూసే ఉంటాం. వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా.. నచ్చింది మాట్లాడకపోయినా ఇలాంటి దాడులకు పాల్పడుతూ ఉంటారు. కానీ మహారాష్ట్రలో మాత్రం మంత్రిపై ఓ యువకుడు పసుపు చల్లి తన నిరసన వ్యక్తంచేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలేం జరిగిందంటే..?

మహారాష్ట్రకు చెందిన రెవెన్యూశాఖ మంత్రి రాధాకృష్ణ విఖే పాటిల్.. షోలాపూర్ జిల్లాలోని ప్రభుత్వ విశ్రాంతి గృహానికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లాలని అనుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మంత్రిని కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. మంత్రి వాటిని చదువుతుండగానే ఓ యువకుడు తన జేబులో నుంచి పసుపు తీసి మంత్రి పాటిల్ తపై చల్లాడు. వెంటనే అప్రమత్తమైన మంత్రి గన్‌మెన్స్, సిబ్బంది ఆ వ్యక్తిపై దాడి చేశారు. అయితే మంత్రి అతడిని వదిలివేయమనడంతో పక్కకు తీసుకెళ్లారు.

పసుపు చల్లిన వ్యక్తి పేరు శేఖర్ బంగాలేగా పోలీసులు గుర్తించారు. తమ వర్గానికి చెందిన ప్రజల ఇబ్బందులపైకి ప్రభుత్వం దృష్టిని మళ్లించడానికే ఇలా చేశానని.. ఎస్టీ విభాగంలో తమకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం మంత్రి రాధాకృష్ణ మాట్లాడుతూ తనపై పసుపు చల్లినందుకు తానేం బాధపడడం లేదన్నారు. పసుపు సంతోషానికి గుర్తు అని.. అందులో తనకు ఏ తప్పూ కనిపించలేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా పసుపు చల్లిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోవొద్దని పోలీసులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..

#maharashtra #viral-video #radhakrishna-vikhe-patil
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe