Coimbatore robbery: తమిళనాడులోని కోయంబత్తూరులో భారీ చోరీ జరిగింది. ఓ ప్రముఖ నగద దుకాణంలోంచి రూ. 25 కిలోల బంగారు, వజ్రాభరణాలను అపహరించారు. గాంధీపురంలో ఉన్న నగల దుకాణంలో ఈ చోరీ జరిగింది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. చోరీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కోయంబత్తూరులోని గాంధీపురంలో ఓ ప్రముఖ నగల షోరూమ్‌లో దొంగలు పడ్డారు. దొంగలు కాదు కాదు దొంగ.. డ్రిల్లింగ్ మిషిన్‌ను ఉపయోగించి షాపులోకి చొరబడ్డాడు. ముసుగు వేసుకున్న దుండగుడు చేతిలో బ్యాగ్‌తో ఏసీ డక్ట్ ద్వారా బిల్డింగ్‌లోకి ప్రవేశించాడు. ఫాల్ సీలింగ్ గ్యాప్ ద్వారా షోరూమ్‌లోకి ప్రవేశించాడు. షోరూమ్ లోపల చాలా ఆభరణాలు ఉన్నప్పటికీ.. దొంగ ఒక కస్టమర్ మాదిరిగా నగలను సెలక్ట్ చేసుకుని మరీ ఎత్తుకెళ్లాడు. షోరూమ్ రెండవ అంతస్థులో ఉన్న నగలనే టార్గెట్‌గా చోరీ చేశాడు దొంగ. మొత్తం 25 కిలోల బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. ఈ చోరీ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Also Read:
తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం.. పోలింగ్‌కు సర్వం సిద్ధం..
ముగిసిన తెలంగాణ ఎన్నికల ప్రచార పర్వం.. ఇప్పటివరకు సర్వేల లెక్కలివే!