Kurnool: సంప్రదాయాలను పాటించడం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ముఖ్యంగా దసరా ఉత్సవాల సమయంలో తమ పూర్వీకుల సంప్రదాయాన్ని కొనసాగించాలనుకున్న ఆ యువకుడు గుర్రపు స్వారీ నేర్చుకోవడానికి సంకల్పించాడు.అదే అతని ప్రాణాల మీదకు తెచ్చింది.
కర్నూలు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. మద్దికేరలో గుర్రపు స్వారీ చేస్తూ కిందపడిన పృథ్వీరాజ్ రాయుడు అనే యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.. ఆ వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి..చికిత్స అందించనప్పటికీ ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ పృథ్వీరాజ్ రాముడు ప్రాణాలు విడిచాడు.
తన పూర్వీకుల నుండి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో గుర్రపు స్వారీ నేర్చుకునేందుకు పృథ్వీరాజ్ సిద్ధమయ్యాడు. కొత్తవారు ఎవరైనా సరే.. గ్రురం పరుగులు పెడుతుంటే.. బ్యాలెన్స్ చేయడం కష్టం.. అదే పరిస్థితి రాముడుకు ఎదరైంది.. గుర్రం ఎక్కి ప్రాక్టీస్ చేస్తుండగా.. అది పరుగులు తీసింది.. కొద్దిసేపు ముందుకు సాగిన అతడు.. ఆ తర్వాత గుర్రంపై నిలవలేకపోయాడు.. బైక్‌పై గుర్రాన్ని వెంబడిస్తూ కొందరు యువకులు.. అదుపుచేసే ప్రయత్నం చేసినా గుర్రం పరుగులు ఆపలేదు.
దీంతో.. అదుపుతప్పి గుర్రంపై నుంచి రోడ్డుపై పడిపోయాడు.. తీవ్రగాయాలతో ప్రాణాపాయస్థితిలోకి వెళ్లిన పృథ్వీరాజు ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కానీ, అతడి ప్రాణాలు కాపాడలేకపోయారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలోనే మృతి చెందాడు. ఆ యువకుడు.. దీంతో.. ఆ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.