/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kharge-1-jpg.webp)
'Come for my funeral' Says Mallikarjun Kharge: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగానికి గురయ్యారు. బుధవారం సొంత జిల్లా కలబురగిలో పర్యటించిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయడం ఇష్ట లేకపోయినా ప్రజల కోసం పని చేశానని భావిస్తే కనీసం తన అంత్యక్రియలకైనా రావాలని కోరారు. అంతేకాదు కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయకుంటే తనకు కలబురగిలో ‘స్థానం’ లేదని భావిస్తానని ఖర్గే చెప్పారు.
ಕಾಂಗ್ರೆಸ್ ಗ್ಯಾರೆಂಟಿಗಳು ನಾಡಿನ ಎಲ್ಲರ ಸಾಮಾಜಿಕ ಮತ್ತು ಆರ್ಥಿಕ ಸಬಲೀಕರಣದ ಸಾಧನಗಳು.
ಗ್ಯಾರೆಂಟಿ ಯೋಜನೆಗಳನ್ನು ನಾವು ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಈಗಾಗಲೇ ಜಾರಿಗೆ ತಂದಿದ್ದೇವೆ, ಈಗ ಭಾರತದಾದ್ಯಂತ 25 ಗ್ಯಾರಂಟಿಗಳನ್ನೂ ಜಾರಿಗೆ ತರಲಿದ್ದೇವೆ.
📍ಆಳಂದ, ಕರ್ನಾಟಕ pic.twitter.com/tADkP0UjgH
— Mallikarjun Kharge (@kharge) April 24, 2024
ఇది కూడా చదవండి: Elon Musk: ఎలాన్ మస్క్ మరో సంచలన నిర్ణయం.. యూట్యూబ్ కు ధీటుగా మరో వేదిక!
మీ మనసులు గెలవలేకపోయా..
ఈ మేరకు ఖర్గే మాట్లాడుతూ.. ‘ఈసారి కాంగ్రెస్‌కు ఓటు వేయకుంటే.. మీ మనసులు గెలవలేకపోయాననుకుంటా. నాకు ఇక్కడ చోటు లేదని భావిస్తా. కాంగ్రెస్‌కు ఓటు వేసినా, వేయకపోయినా నేను ఈ ప్రాంతానికి పని చేశానని అనుకుంటే, కనీసం నా అంత్యక్రియలకైనా హాజరుకండి’ అంటూ ఎమోషనల్ అయ్యారు. అలాగే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ సిద్ధాంతాలను ఓడించేందుకు పోరాడతానని చెప్పారు. వాళ్ల ముందు తలొగ్గే ప్రసక్తే లేదని, రాజకీయాల కోసమే తాను పుట్టానని, ఎన్నికల్లో పోటీ చేసినా, చేయకున్నా.. చివరి శ్వాస వరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు.