మల్లారెడ్డి కోడలా మాజాకా.. డ్యాన్స్ అదుర్స్..!

సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి సందడి చేశారు. మామ పాటలు పాడి అలరిస్తే.. కోడలు విద్యార్థులతో కాలు కదిపారు.

New Update
మల్లారెడ్డి కోడలా మాజాకా.. డ్యాన్స్ అదుర్స్..!

సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఆయన కోడలు ప్రీతిరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులతో కలిసి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి సందడి చేశారు. మామ పాటలు పాడి అలరిస్తే.. కోడలు విద్యార్థులతో కాలు కదిపారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్‌గా మారింది.

ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. గతంలో పాలు అమ్మినా.. పూలు అమ్మినా.. అలాంటిది ఇప్పుడు ప్రపంచస్థాయి డాక్టర్లు, ఇంజనీర్లు, ఫార్మాసిస్ట్స్‌ను తయారుచేస్తున్నానని పేర్కొన్నారు. దేవుడి దయ వల్లే ఇంత చేస్తున్నానని.. తన జన్మ ధన్యమైందన్నారు. మిగిలిన జీవితమంతా ప్రజాసేవ చేస్తానని మల్లారెడ్డి తెలిపారు.

ఎక్కువ మంది డాక్టర్లను తయారుచేస్తున్నందుకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల్లో మల్లారెడ్డి విద్యాసంస్థలు చోటు దక్కించుకోవడం సంతోషంగా ఉందని ప్రీతిరెడ్డి తెలిపారు. తన మామ మల్లారెడ్డి ఇండియాలోనే తొలిసారిగా విజనరీ లీడర్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందని ప్రీతిరెడ్డి వెల్లడించారు.

Advertisment
తాజా కథనాలు