మల్కాజ్‌గిరి బాలుడు హర్ష వర్ధన్ కిడ్నాప్ కేసులో కొత్త కోణాలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. కిడ్నాపర్స్‌లో నలుగురు పెద్దవాళ్లు ఒక మైనర్ బాలుడు ఉన్నట్టు సమాచారం. కిడ్నాప్‌లో మైనర్ బాలుడే కీలక పాత్ర పోషించినట్టు సమాచారం. క్రికెట్ బాల్ కొందామని హర్షవర్ధన్‌ను కారు ఎక్కించిన మైనర్ బాలుడు. ఆపై కిడ్నాప్ చేసిన ఫస్ట్ రోజు బాలుడిని ఆలేరులోని ఓ ఫామ్ హౌస్‌లో నిందితులు దాచారు. అక్కడి నుండి ఇంటికి వెళ్తున్నామని చెప్పి ఒకచోట నుంచి ఇంకో చోటికి కారులో తిప్పారు.
గతం మరిచిపోయేలా ప్లాన్
హర్షవర్ధన్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడు వచ్చేసి కడప జిల్లాకు చెందిన శివగా పోలీసులు గుర్తించారు. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో శివ భారీగా డబ్బు పోగొట్టుకున్నాడు. నష్టాన్ని పూడ్చుకోవడానికి కిడ్నాప్‌నకు ప్లాన్ చేశాడు. బాలుడు ప్లాన్‌కు కడప నుంచి శివ స్కెచ్ వేయడంతో పాటు అక్కడి నుంచే డైరెక్ట్ చేశాడు. మైనర్ బాలుడితో సహా మొత్తం నలుగురుతో ముఠా ఏర్పాటు చేశారు. కిడ్నాప్ ప్లాన్‌ను కడప నుంచే శివ డైరెక్ట్ చేశారు. కిడ్నాప్ అనంతరం డబ్బు అందాక బాలుడు గతం మరిచిపోయేలా స్నేహితులతో కలిసి సర్జరీ ప్లాన్ కూడా శివ చేసినట్టు తెలుస్తోంది.
బాలుడు క్షేమం
హైదరాబాద్‌లో 8వ తరగతి విద్యార్థి అదృశ్యం తీవ్ర కలకలం రేపింది. మల్కాజ్‌గిరిలో నివాసముంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు హర్షవర్ధన్ ఈ నెల 16వ తారీఖున కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు 36 గంటల్లో కిడ్నాప్ కేసును ఛేదించారు. సీసీటీవీ ఫుటేజ్, ఇతర వివరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. కారులో బాలుడిని కిడ్నాప్ చేసిన నలుగురు వ్యక్తులను రామన్నగూడెం వద్ద పోలీసులు పట్టుకున్నారు. బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు.