ఇటీవల ప్రధాని మోదీ లక్షద్వీప్‌లో పర్యటించిన తర్వాత.. భారత్‌పై, ప్రధానిపై మాల్దీవుల మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దెబ్బకు బాయికాట్ మాల్దీవులు అంటూ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండింగ్ అయ్యింది. పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో సహా అనేకమంది భారత్‌కు మద్దతిస్తూ మాల్దీవుల మంత్రులపై విరుచుకుపడ్డారు. ఇకనుంచి లక్షద్వీప్‌కే టూర్‌కు వెళ్లాలంటూ పోస్టులు పెట్టారు. ఈ అంశం దేశవ్యాప్తంగా దుమారం రేపడంతో మాల్దీవుల ప్రభుత్వం ఆ మంత్రులపై వేటు వేసింది.
మార్చి 15 నాటికి వెళ్లిపోవాలి
అయితే మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని వెనక్కి పిలిపించాలన్న అభ్యర్థనపై ఇరు దేశాల అధికారులు ఆదివారం సమావేశమయ్యారు. మాలేలోని విదేశాంగ శాఖ కార్యాలయంలో ఈ అంశంపై చర్చలు జరిపారు. అయితే మార్చి 15వ తేదీ నాటికి భారత సైన్యాన్ని వెనక్కి పంపించే ప్రక్రియను పూర్తి చేయాలని తమ దేశ అధ్యక్షుడు చెప్పాడని మాల్దీవుల అధికారులు భారత హై కమీషనర్‌కు తెలియజేశారు. అలాగే వీటితో పాటు భారత్‌లో చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలను సైతం సమీక్షించనున్నట్లు మాల్దీవుల సమాచార వ్యవహారాల మంత్రి ఇబ్రహీం ఖలీల్ ఓ స్థానిక వార్త పత్రికకు చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. రామ్ రసోయిలో ..ఉచితంగా..!!
భారత్ హెలికాప్టర్లు వాడొద్దు
అంతేకాదు గతంలో భారత్.. మానవతా అవసరాల కోసం మాల్దీవులకు ఇచ్చిన రెండు హెలికాప్టర్లు ఇచ్చిందని.. వాటిని వినియోగించడం కూడా ఆపేయాలని అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ఆదేశించినట్లు చెప్పారు. ఇదిలాఉండగా.. ప్రస్తుతం మాల్దీవుల్లో 77 మంది భారత సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే గత ఏడాది నవంబర్ మయిజ్జు విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాను గెలిచిన తర్వాత భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని అప్పట్లోనే భారత్‌ను అభ్యర్థించారు.
చిన్న దేశమని బెదిరిస్తారా ?
ఇటీవల మయిజ్జు చైనా పర్యటనకు వెళ్లి కొన్ని ఒప్పందాలు చేసుకున్నారు. శనివారం స్వదేశానికి వచ్చిన తర్వాత ఏ దేశం పేరును నేరుగా ప్రస్తావించకుండానే సంచలన వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు భౌగోళికంగా చిన్న దేశం అని.. అయినంత మాత్రను తమను బెదరించడం సరికాదన్నారు. అయితే ఈ వ్యవహారంపై చైనా కూడా స్పందించింది. మాల్దీవుల అంతర్గత విషయాల్లో ఏ దేశమైనా జోక్యం చేసుకున్నా కూడా గట్టిగా వ్యతిరేకిస్తామంటూ ప్రకటన చేసింది.
Also Read: కరోనా లాంటి మరో వైరస్.. థాయ్‌లాండ్‌లో గుర్తించిన శాస్త్రవేత్తలు..