Maldives: మాల్దీవుల అధ్యక్షుడి పై అభిశంసన తీర్మానం..సిద్దమైన ప్రతిపక్షం!

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజు పై అభిశంసన తీర్మానం తీసుకుని వచ్చేందుకు మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షం సిద్దమైంది. ఇప్పటికే ముయిజ్జూ ప్రభుత్వం పై మాల్దీవియన్‌ డెమోక్రటిక్ పార్టీ అభిశంసన ప్రక్రియ కోసం సంతకాలను సేకరించడం ప్రారంభించింది.

New Update
Maldives: మాల్దీవుల అధ్యక్షుడి పై అభిశంసన తీర్మానం..సిద్దమైన ప్రతిపక్షం!

మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు మొహమ్మద్‌ ముయిజు (Mohamed Muizzu) పై అభిశంసన తీర్మానం తీసుకుని వచ్చేందుకు మాల్దీవుల ప్రధాన ప్రతిపక్షం సిద్దమైంది. ఇప్పటికే ముయిజ్జూ ప్రభుత్వం పై మాల్దీవియన్‌ డెమోక్రటిక్ పార్టీ (Maldivian Democratic Party) అభిశంసన ప్రక్రియ కోసం సంతకాలను సేకరించడం ప్రారంభించింది. ముయిజ్జూ పై గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.

అందుకుగానూ సేకరించిన సంతకాలను అతి త్వరలోనే పార్లమెంటుకు సమర్పించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ అభిశంసన తీర్మానానికి ఎండీపీ, డెమోక్రాట్‌ ల ప్రతినిధులు అందరితో కలిపి మొత్తం 34 మంది సభ్యులు ఆమోదించినట్లు ఓ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆదివారం మాల్దీవుల పార్లమెంట్ సమావేవంలో ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే.

స్పీకర్‌ ను అడ్డగించేందుకు ప్రయత్నించిన ప్రతిపక్ష నాయకుల పై అధికార పక్ష నేతలు దాడికి దిగారు. దీంతో సభలో కాసేపు గందరగోళం రేగింది. దీంతో సోమవారం నాడు పార్లమెంట్‌ సమావేశంలో భారీగా భద్రతా సిబ్బంది మోహరించారు. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఇందులో ఎంపీలు అంతా స్పీకర్ కుర్చీ వద్ద ఆందోళనకు దిగినట్లు కనిపిస్తుంది.

అభిశంసన తీర్మానానికి ఓటింగ్‌ కి ముందు ముయిజ్జు క్యాబినేట్‌ లో నలుగురు సభ్యుల పార్లమెంటరీ ఆమోదాన్ని రద్దు చేయాలని ఎండీపీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతోనే పార్లమెంట్‌ లో హింస మొదలైంది. దాని తరువాత మాల్దీవుల ప్రభుత్వ అనుకూల ఎంపీలు కూడా నిరసనకు దిగడంతో మరింత గందరగోళం నెలకొంది.

ప్రభుత్వ ఎంపీలు ఇలానే ఉంటే మాత్రం హోం మంత్రి అలీ ఇహుసన్‌, రక్షణ మంత్రి మౌమూన్‌ ఆమోదాన్ని కూడా నిరాకరించాలని నిర్ణయించింది.

Also read: ముగిసిన విజయవాడ దుర్గ గుడి పాలక మండలి సమావేశం..ఏం నిర్ణయించారంటే!

Advertisment
తాజా కథనాలు