Malayalam Movies: వెండితెరపై మలయాళం సినిమాల మేజిక్.. చరిత్ర తిరగరాస్తున్న ఇండస్ట్రీ.. ఒకప్పుడు బోల్డ్ సినిమాలుగా ముద్ర వేసుకున్న మళయాళ సినిమా ఇప్పుడు మంచి సత్తా ఉన్న కొత్తతరం సినిమాలుగా నిలబడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో విడుదలైన నాలుగు మళయాళ సినిమాలు రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతున్నాయి. వందల కోట్లు కొల్లగొడుతున్న వీటి వివరాలు ఈ ఆర్టికల్ లో చూడొచ్చు. By KVD Varma 09 Mar 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Malayalam Movies: ఒకప్పుడు మలయాళ సినిమాలు అంటే.. అదోరకం సినిమాలు అని పేరు. మంచి సినిమాలు వచ్చినా.. బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు ఎక్కువగా ఉండేవి. అప్పట్లో మలయాళం సినిమాలు అంటే మార్నింగ్ షో సినిమాలుగా ఉండిపోయేవి. కానీ, ఇప్పుడు మలయాళం సినిమాల దశ తిరిగిపోయింది. వరుసగా సినిమాలు.. అన్నీ హిట్స్. ఇటు బిగ్ స్క్రీన్ మీద సందడి చేస్తున్న సినిమాలు.. అటు ఓటీటీ మీద కూడా జైత్రయాత్ర సాగిస్తున్నాయి. ప్రతివారం కనీసం రెండు మూడు మళయాళ సినిమాలు (Malayalam Movies)ఓటీటీ ప్లాట్ ఫామ్స్ పై హంగామా చేస్తున్నాయంటేనే మలయాళ సినిమా ఎలా వెలిగిపోతోందో అర్ధం అవుతుంది. ఫిబ్రవరి నెలలో వచ్చిన నాలుగు మలయాళం సినిమాలు(Malayalam Movies) దేశవ్యాప్తంగా దుమ్ము రేపుతూ సత్తా చూపిస్తున్నాయి. వరుస హిట్లతో మలయాళ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ లను షేక్ చేస్తోంది. అయితే, ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే.. ఇటీవల సూపర్ హిట్ అయినా సినిమాలు నాలుగు కూడా ఊహించని కథలు.. కథనాలు.. హీరో క్యారెక్టరైజేషన్ వంటి కొత్తదనంతో వచ్చినవే. కొన్ని సినిమాలకు అసలు చెప్పుకోదగ్గ నటీనటులు లేరు. సూపర్ స్టార్ నటించిన సినిమాలో హీరోయిజం కనిపించలేదు. అంటే, నవ్యతలో మళయాళ సినిమాలు ఎలాంటి చరిత్ర సృష్టిస్తున్నాయి అర్ధం చేసుకోవచ్చు. ఇక ఈ మధ్య వచ్చి బాక్సాఫీస్ ని కళకళ లాడిస్తున్న నాలుగు సినిమాలు ఏమిటో చూద్దాం. ఫిబ్రవరి నెల మొదటి వారంలో వచ్చింది(Malayalam Movies) టొవినో థామస్ థ్రిల్లర్ మూవీ ‘అన్వేషిప్పిన్ కండేదుం’. విడుదలవుతూనే సూపర్ టాక్ తో దూసుకుపోయింది. తక్కువ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా బడ్జెట్ కు నాలుగింతలు వసూలు చేస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండోవారంలో దీన్ని మించిన సంచలనం నమోదు అయింది. అది ప్రేమలు సినిమా. ఈ మూవీ రిలీజ్ అవుతూనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన దగ్గర నుంచి నెల రోజులు దాటినా ఇప్పటివరకూ అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు ఇంకా కనిపిస్తూనే ఉన్నాయి. ఈ సినిమా మలయాళ వెర్షన్(Malayalam Movies) హైదరాబాద్ లో కూడా సంచలనం సృష్టించింది. సూపర్ టాక్ తో మంచి కలెక్షన్స్ రాబట్టింది. దీనిని తెలుగులోకి డబ్ చేసి శుక్రవారం అంటే మార్చి 8న రిలీజ్ చేశారు. తెలుగు వెర్షన్ మంచి ఓపెనింగ్స్ తో దూసుకుపోతోంది ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ. ఈ రెండు సినిమాల తరువాత, మలయాళ సూపర్ స్టార్ మమ్మూట్టి నటించిన భ్రమ యుగం మూవీ సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఒక ప్రత్యేకమైన పాత్రలో ముమ్మూట్టి నట విశ్వరూపం చూపించిన భ్రమ యుగం సినిమా మలయాళ సినిమా(Malayalam Movies) చరిత్రలో రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా కొల్లగొట్టిన భ్రమయుగం ఇప్పుడు 100 కోట్ల క్లబ్ వైపు వేగంగా పరుగులు తీస్తోంది. అన్నట్టు ప్రేమలు సినిమా కూడా ఇప్పటికే 70 కోట్లు రాబట్టింది. ఇది కూడా 100 కోట్ల దిశలో దూసుకుపోతోంది. ఇక ఫిబ్రవరి చివరిలో సైలెంట్ గా వచ్చిన చిదంబరం ఎస్ దర్శకత్వంలో రూపొందిన “మంజుమెల్ బాయ్స్” సినిమా అయితే థియేటర్లలో రాక్ చేస్తోంది. పెద్దగా ప్రమోషన్స్ లేకుండా వచ్చిన ఈ సినిమా మౌత్ టాక్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. “మంజుమెల్ బాయ్స్” సినిమా గురించి కొంత చెప్పుకోవాలి. ఈ సినిమాలో నటించిన వారిలో 85 శాతం మంది కొత్తవారే. అసలు అంచనాలు లేకుండా విడుదలైన చిన్న సినిమా ఇది. ఫిబ్రవరి 22న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిన్న సినిమా మలయాళంలో (Malayalam Movies)సూపర్ హిట్ కావడం ఒక్కటే కాదు అదే మలయాళ వెర్షన్ తమిళనాడులోనూ సంచలనం సృష్టించింది. మొదటి వారంలోనే మలయాళ వెర్షన్ 10 కోట్ల రూపాయలు రాబట్టింది చెబుతున్నారు. అంటే అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా స్టామినా. తమిళ, కర్ణాటక రాష్ట్రాలు కాకుండాప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటికే 65 కోట్ల రూపాయల వసూళ్ల వర్షం కురిపించింది. ఇది కూడా 100 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. Also Read: జగదేక వీరుడు.. అతిలోకసుందరి రామ్ చరణ్ – జాన్వీ అయితే ఎలా ఉంటుందంటే.. అంటే, ఒక్క నెలలో నాలుగు మలయాళ సినిమాలు 100 కోట్ల క్లబ్ లో చేరిపోతున్నాయి. ఈ లెక్క చాలు మళయాళ ఇండస్ట్రీ(Malayalam Movies)ప్రస్తుతం ఎలాంటి సినిమాలతో థియేటర్లను షేక్ చేస్తుందో చెప్పడానికి. ముందే చెప్పినట్టు.. ఈ సినిమాలు ఏవీ రొటీన్ ఫార్ములాలతో వచ్చినవి కావు. అలానే రొట్టకొట్టుడు హీరోయిజాన్ని చూపించినవి కావు. సూపర్ స్టార్ హీరో అయినా ఒక్కదెబ్బకు వందమంది పడిపోయేలాంటి సీన్స్ ఉన్న సినిమాలు కానేకాదు. కేవలం కొత్తదనం. నిజాయితీగా సినిమా తీయడం. ప్రేక్షకులకు వినోదాన్ని ఇస్తున్నాం అంటూ వెర్రి వేషాల జోలికి పోకుండా కథలో ఒదిగిపోయి నటిస్తున్న ముమ్ముట్టి లాంటి సూపర్ స్టార్స్ గొప్పతనం. చివరిగా ఒక్క మాట సౌత్ ఇండస్ట్రీలో టాప్ లో ఎప్పుడూ తమిళ, తెలుగు సినిమాల మధ్యే పోటీ. కానీ, ఇప్పుడు కాంతారా లాంటి సినిమాలతో కన్నడ సినిమా.. ఇదిగో నాలుగు వరుస హిట్లతో మలయాళ సినిమాలు (Malayalam Movies) మేమూ ఉన్నామంటూ దూసుకుపోతున్నాయి. ఇండియన్ సినిమా అంటే, బాలీవుడ్ మాత్రమే అనే భ్రమల్లో ఉన్నవారికి ఇప్పుడు సౌత్ సినిమా లేకపోతె ఇండియా సినిమా లేదు అనే పంచ్ గట్టిగా ఇస్తున్నాయి మన సినిమాలు. కన్నడ, మలయాళ సినిమాలు కొత్తదనంతో కొడుతుంటే, తెలుగు తమిళ సినిమాలు తమ మార్కెటింగ్ స్ట్రాటజీతో కొడుతున్నాయి. ఇడ్లీ సాంబార్ అంటూ వెటకారం చేసే బాలీవుడ్ బాబులకు దిమ్మ తిరిగే సమాధానాన్ని ఇస్తున్నాయి. ముమ్ముట్టి భ్రమయుగం ట్రైలర్ ఇక్కడ చూసేయండి: #movie-news #malayalam మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి