Jayasurya: మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటుల పరిస్థితుల పై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. ఈ రిపోర్ట్ లో ఊహించని విషయాలు బయటపడ్డాయి. ఇండస్ట్రీలో మహిళా నటులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు ఒక్కొకరుగా బయటకొచ్చి ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న వేధింపులను బయటపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నటులు సిద్దిఖీ, రంజిత్, జయ సూర్య, మణియం పిళ్ల రాజు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎమ్ ముకేశ్ సహా పలువురి పై మహిళా వేధింపుల కేసు నమోదు చేశారు.
ఇదిలా ఉంటే తాజాగా నటుడు జయ సూర్య పై మరో కేసు నమోదైంది. 354, 354A(A1) (I), 354D ఐపీసీ సెక్షన్ల కింద రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నటి మిను మునీర్ స్టేట్మెంట్ ఆధారంగా తిరువనంతపురంలో అతనిపై రెండో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ బుధవారం నటి మునీర్ వాంగ్మూలాన్ని తీసుకుంది. అందులో ఆమె ముఖేష్ ఎం, జయసూర్య, మణియంపిళ్ల రాజు, ఇడవెల బాబు ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలో తనను మాటలతోనే కాకుండా శారీరకంగాను అబ్యూస్ చేశారని ఆరోపించింది. కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఇండస్ట్రీ పై వస్తున్న ఆరోపణలను దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక కమిటీ సిట్ ను ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి విజయన్ నేపథ్యంలో ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Read: Malayalam Industry: మలయాళ సినీ ఇండస్ట్రీలో పెద్ద కుదుపు.. ఆ రిపోర్టుపై సిట్ ఏర్పాటు! - Rtvlive.com