Jayasurya: మలయాళ ఇండస్ట్రీలో మహిళా నటుల పరిస్థితుల పై జస్టిస్ హేమా కమిటీ సమర్పించిన నివేదిక సంచలనంగా మారింది. ఈ రిపోర్ట్ లో ఊహించని విషయాలు బయటపడ్డాయి. ఇండస్ట్రీలో మహిళా నటులు లైంగిక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ సమస్యలను ఎదుర్కొన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఈ నేపథ్యంలో బాధిత మహిళలు ఒక్కొకరుగా బయటకొచ్చి ఇండస్ట్రీలో తాము ఎదుర్కున్న వేధింపులను బయటపెడుతున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే నటులు సిద్దిఖీ, రంజిత్, జయ సూర్య, మణియం పిళ్ల రాజు, సీపీఐ(ఎం) ఎమ్మెల్యే, నటుడు ఎమ్ ముకేశ్ సహా పలువురి పై మహిళా వేధింపుల కేసు నమోదు చేశారు.
పూర్తిగా చదవండి..Jayasurya: జయసూర్య లైంగిక ఆరోపణలు.. రెండో కేసు నమోదు..!
మాలీవుడ్ లో మహిళా నటుల వేధింపుల విషయంలో ఇప్పటికే నటుడు సిద్ధిఖీ, జయసూర్య, రంజిత్ పై కేసు నమోదైంది. తాజాగా జయసూర్య పై మరో కేసు నమోదైంది. నటి మిను మునీర్ స్టేట్మెంట్ ఆధారంగా 354, 354A(A1) (I), 354D సెక్షన్ల కింద రెండో FIR నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Translate this News: