/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-3-15.jpg)
Malayalam Actor Mohan Lal : ప్రముఖ మలయాళ నటుడు మోహన్ లాల్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఆయన తీవ్ర జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కండరాల నొప్పులతో బాధపడుతున్న నేపథ్యంలో కోచిలోని అమృత ఆస్పత్రిలో చేరారు. డాక్టర్ల పరీక్షల తర్వాత మోహన్ లాల్‌కు వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ, పూర్తిగా కోలుకోవడానికి ఐదు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ప్రజా సందర్భాలకు దూరంగా ఉండాలని సూచించారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా బయటికొచ్చింది. మోహన్‌లాల్ హెల్త్ బులెటిన్ అంటూ ఓ ప్రముఖ సినీ విశ్లేషకుడు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయగా అది వైరల్ అవుతోంది.
Wishing @Mohanlal a speedy recovery! ❤️🩹 pic.twitter.com/DjcRzrOdwV
— Sangeeth Vatakara (@sangeethvtk) August 18, 2024
Also Read : మరోసారి బాలీవుడ్ ను టార్గెట్ చేసిన కంగనా రనౌత్.. వాళ్లకేం తెలీదంటూ
ఆ మెడికల్ సర్టిఫికెట్ జారీ చేసిన తేదీ ఆగస్టు 16గా ఉండడం గమనార్హం. మోహన్ లాల్ ఆస్పత్రిలో చేరారనే వార్త తెలియగానే అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తమ ప్రియమైన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా మోహన్ లాల్ ఆరోగ్యం గురించి చర్చ జరుగుతోంది.