Malawi Vice President: మరో ఘోర విమాన ప్రమాదం.. దేశ ఉపాధ్యక్షుడి దుర్మరణం! మలావీ ఉపాధ్యక్షుడు 'సౌలస్ షిలిమా' ప్రయాణించే విమానం తప్పిపోయిన కథ విషాందాంతమైంది. అందులో ఉన్న 10 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు. By srinivas 11 Jun 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Plane crash: ఆఫ్రికా దేశమైన మలావీ ఉపాధ్యక్షుడు సౌలస్ షిలిమా... మరో తొమ్మిది మంది కలిసి వెళ్లిన విమానం అదృశ్యం కథ విషాదాంతమైంది. సౌలస్ షిలిమాతో సహా అందులో ఉన్న 9 మంది దుర్మరణం చెందినట్లు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. విమానం పర్వత ప్రాంతాల్లో కూలిపోయింది. గల్లంతైన విమానం శకలాలను గుర్తించాం. అందులో ఎవరూ ప్రాణాలతో లేరు' అని మలావీ దేశాధ్యక్షుడు లాజరస్ చక్వేరా వెల్లడించారు.\ As we leave, we are delighted to report on a fruitful trip to Seoul, Republic of Korea, where we addressed the Korea-Africa Summit, emphasizing partnership for progress. We met with Prime Minister Han Duck Soo, strengthening bilateral ties and investment opportunities. pic.twitter.com/OU82zDI3nZ — Dr Saulos Chilima (@SKChilima) June 6, 2024 ఈ మేరకు మలావీ రాజధాని లిలోంగ్వే నుంచి బయలుదేరిన ఆ విమానం 370 కిలోమీటర్ల దూరంలోని జుజు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగాల్సి ఉంది. ప్రయాణ సమయం 45 నిమిషాలు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా అక్కడ దిగవద్దని, తిరిగి లిలోంగ్వేకు వెళ్లిపోవాలని ఏటీసీ సూచించింది. ఈ క్రమంలోనే రాడార్‌తో విమానం సంబంధాలు తెగిపోయాయి. గల్లంతైన విమానం కోసం మలావీ సైన్యం భారీ సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ వందల మంది సైనికులు, పోలీసులు, అటవీ అధికారులతో ముమ్మరంగా గాలించింది. పొరుగు దేశాల హెలికాప్టర్లు, డ్రోన్లను రంగంలోకి దించింది. అంగోలా దేశ అంతరిక్ష కేంద్రం సహాయాన్ని కోరింది. అమెరికా, బ్రిటన్, నార్వే, ఇజ్రాయెల్ కూడా సహాయం అందించేందుకు ముందుకువచ్చాయని మలావీ ప్రభుత్వం వెల్లడించింది. Arriving at the Korea-Africa summit earlier this afternoon, marking the beginning of a fruitful engagement aimed at strengthening bilateral ties and fostering cooperation between Malawi and Korea.#KoreaAfricaSummit #PartnershipForProgress pic.twitter.com/K0Ks9qPctQ — Dr Saulos Chilima (@SKChilima) June 4, 2024 #died #malawi #vice-president-saulus-shilima మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి