Fake Mysore Sandal Soap : అచ్చు...మైసూర్ శాండల్ సబ్బులాగే....

కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ కేఎస్‌డీఎల్ ఉత్పత్తి చేస్తున్న మైసూర్ శాండల్ సబ్బులకు నకిలీ సబ్బులను తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

New Update
Fake Mysore Sandal Soap : అచ్చు...మైసూర్ శాండల్ సబ్బులాగే....

Fake Mysore Sandal Soaps: సువాసనలు వెదజల్లే మైసూర్ శాండల్ సబ్బులను కొనుగోలు చేస్తున్నారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. అవి నిజమైన సబ్బులు కాకపోవచ్చు. ఒకసారి పూర్తిగా పరిశీలించాకే కొనుగోలు చేయండి. లేదంటే డబ్బులతో పాటు ఆరోగ్యం పాడు చేసుకోక తప్పదు.

హైదరాబాద్ కేంద్రంగా నకిలీ మైసూర్ శాండల్(Mysore Sandal Soap) సబ్బులను తయారు చేస్తున్న ముఠాను మలక్ పేట పోలీసులు అరెస్ట్ చేశారు. కర్ణాటక ప్రభుత్వానికి చెందిన కర్ణాటక సోప్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్) మైసూర్ శాండల్ సబ్బులను ఉత్పత్తి చేస్తుంది. అయితే దానికి సంబంధించిన నకిలీ సబ్బులను తయారు చేసి విక్రయిస్తున్న నిందితులు రాకేష్ జైన్, మహావీర్ జైన్‌లను శనివారం అరెస్ట్ చేసిన పోలీసులు నకిలీ ఉత్పత్తులు, ప్యాకేజింగ్ మెటీరియల్స్ సహా సుమారు రూ.2 కోట్ల విలువైన మెటీరియల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: లాడ్జికి వెళ్లిన దంపతులపై దారుణం.. భార్యపై గ్యాంగ్ రేప్

ఈ ముఠాపై కేఎస్‌డీఎల్ ప్రెసిడెంట్ మంత్రి ఎంబీ పాటిల్ కు గుర్తు తెలియని వ్యక్తులు సమాచారం అందించారు. హైదరాబాద్‌లో నకిలీ మైసూర్ శాండల్ సబ్బులు చెలామణి అవుతున్నాయని సమాచారం అందుకున్న మంత్రి పాటిల్, ఈ విషయాన్ని పరిశీలించాలని కేఎస్‌డీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రశాంత్‌ను ఆదేశించారు. దీంతో ఆయన నకిలీ సబ్బుల తయారీ మూఠాను పట్టుకోవడానికి కేఎస్‌డీఎల్ బృందాలు రంగంలోకి దిగాయి. ఈ క్రమంలో మార్కెట్ లో నకిలీ సబ్బుల ఉనికిని గుర్తించిన వారు దాని మూలాల్ని పట్టుకోవడానికి ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. దానికోసం వారు మొదట లక్ష రూపాయల విలువైన నకిలీ ఉత్పత్తులను కొనుగోలు చేసి, తయారీ యూనిట్‌ను వెలికితీశారు. అనంతరం మలక్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తయారీ కేంద్రం పై దాడిచేసి 150 గ్రాముల సబ్బు ప్యాక్‌లతో కూడిన 20 డబ్బాలను,75 గ్రాముల సబ్బుతో కూడిన 47 అట్టపెట్టెలు, 150 గ్రాములు, 75 గ్రాముల సబ్బులకు సంబంధించిన 400 ఖాళీ ప్యాకేజింగ్ బాక్స్‌లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు