Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. 'హరిహర వీరమల్లు' నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబోలో రాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. తాజాగా ఈ మూవీకి సంబంధించి సూపర్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. హరిహర వీరమల్లు రెండు భాగాలుగా రాబోతున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్న పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్.. 'హరిహర వీరమల్లు'  నుంచి సూపర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్
New Update

Pawan Kalyan: ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ ఎలక్షన్స్ ప్రచారంలో బిజీగా ఉన్నారు. దీంతో ఇప్పటికే ఆయన సైన్ చేసిన ప్రాజెక్ట్స్ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. వాటిలో ఒకటి 'హరహర వీరమల్లు'. స్టార్ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన కళ్యాణ్ నటిస్తున్న చిత్రం 'హరహర వీరమల్లు'.  2020లోనే మొదలైన ఈ సినిమా షూటింగ్ ఇంకా చిత్రీకరణ దశలోనే ఉంది. ఇప్పటికీ కేవలం 50 శాతం మాత్రమే పూర్తయినట్లు సమాచారం. దీంతో ఈ మూవీ పై అనేక రూమర్స్ వస్తున్నాయి. సినిమా అవుట్ పుట్ పై పవన్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే మూవీని పక్కన పెట్టేశారనే వార్తలు తెగ వైరలయ్యాయి. దీనికి సంబంధించి మేకర్స్ నుంచి కూడా ఎలాంటి స్పందన లేకపోవడంతో.. సినిమా నిజంగానే ఆగిపోయిందని భావించారు ఆడియన్స్.

Nagababu: ఆ వ్యాఖ్యల పై నన్ను క్షమించండి.. వైరలవుతున్న నాగ బాబు ట్వీట్

రెండు భాగాలుగా హరహర వీరమల్లు

అయితే తాజాగా ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం ఈ వార్తలన్నింటికీ చెక్ పెట్టారు. ఇటీవలే ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ఆయన ఇలా మాట్లాడారు.. "హరహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ ను కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు జాతీయ స్థాయిలో కూడా పవర్ స్టార్ చేసే మూవీ. ఈ సినిమాతో డబ్బు సంపాదించడం నా లక్ష్యం కాదు. పవన్ కెరీర్ లో ఈ సినిమా నిలిచిపోయేలా.. అలాగే తెలుగు సినిమాకు గొప్ప పేరు తెచ్చేలా హరహర వీరమల్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.

17వ శతాబ్దానికి చెందిన సినిమా కావడంతో చిత్రీకరణ కాస్త ఆలస్యం అవుతుంది. ఏపీ ఎన్నికలు పూర్తవగానే పవన్ కళ్యాణ్ తిరిగి షూటింగ్ లో పాల్గొంటారు. అంతే కాదు హరహర వీరమల్లు చిత్రాన్ని రెండు భాగాలుగా రాబోతుంది. ఇప్పటికే సెకండ్ పార్ట్ కు సంబంధించిన పనులు కూడా మొదలయ్యాయి అని పేర్కొన్నారు".

Also Read: Prabhas Spirit Movie: పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్.. స్పిరిట్ స్టోరీ లైన్ పై సందీప్ వంగా క్లారిటీ

#pawan-kalyan #hara-hara-veeramallu-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe