Maidaan : ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవగన్ 'మైదాన్'.. కానీ ఓ ట్విస్ట్?

అజయ్ దేవగన్ మైదాన్ మూవీని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో వదిలారు. ట్విస్ట్ ఏంటంటే, రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది.

Maidaan : ఓటీటీలోకి వచ్చేసిన అజయ్ దేవగన్ 'మైదాన్'.. కానీ ఓ ట్విస్ట్?
New Update

Ajay Devgan's Maidaan Movie On OTT :  బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అజయ్ దేవగన్ (Ajay Devgan) నటించిన రీసెంట్ మూవీ 'మైదాన్' (Maidaan) చడీ చప్పుడు లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఏప్రిల్ నెలలో థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎలాంటి అనౌన్స్ మెంట్ లేకుండా ప్రముఖ ఓటీటీ (OTT) లో స్ట్రీమింగ్ అవుతుంది. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ పెట్టారు?

ఓటీటీలోకి వచ్చేసిన 'మైదాన్'.. కానీ ఓ ట్విస్ట్?

హైదరాబాద్ ఫుట్ బాల్ కోచ్ జీవితం ఆధారంగా మైదాన్ మూవీ తెరకెక్కింది. ఇందులో అజయ్ దేవగన్ లీడ్ రోల్ ప్లే చేశాడు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియమణి, రుద్రనీల్ ఘోష్, చైతన్య శర్మ కీలకపాత్రలు పోషించారు. బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమా ఏళ్ళ తరబడి షూటింగ్ జరుపుకుంది. అలాగే రిలీజ్ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. అలా ఎట్టకేలకు ఈ ఏడాది ఏప్రిల్ 10 నథియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది.

కానీ కలెక్షన్స్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఇక ఇదే మూవీని తాజాగా అమెజాన్ ప్రైమ్ లో వదిలారు. ట్విస్ట్ ఏంటంటే, రెంటల్ విధానంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి హిందీలో మాత్రమే స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమాను ఓటీటీలో చూడాలనుకుంటే రూ. 349 చెల్లించాల్సి ఉంటుంది.

Also Read : కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రెడ్ కార్పెట్‌ పై అదరగొట్టిన భారత సెలబ్రిటీలు!

#ajay-devgan #maidaan-movie-on-ott #bollywood
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe