Mahua Moitra: ఎథిక్స్ కమిటీ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచింది.. మహువా మొయిత్ర ఫైర్

లోకసభ నుంచి తనను బహిష్కరించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్ర ఫైర్ అయ్యారు. నిబంధనలు పాతరేసి ఎథిక్స్ క‌మిటీ వ్యవహరించిందని విమర్శించారు.

New Update
Mahua Moitra: ఎథిక్స్ కమిటీ రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచింది.. మహువా మొయిత్ర ఫైర్

Mahua Moitra: లోకసభ నుంచి తనను బహిష్కరించడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మెయిత్ర ఫైర్ అయ్యారు. నిబంధనలు పాతరేసి ఎథిక్స్ క‌మిటీ వ్యవహరించిందని విమర్శించారు. ఎథిక్స్ క‌మిటీని ఆయుధంగా మలచుకుని ఈ ప్రభుత్వం విప‌క్ష నేత‌ల‌ను బుల్డోజ్ చేస్తోంద‌ని ఆరోపించారు. బీజేపీ అప్రజాస్వామిక చర్యలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు.

ఇది కూడా చదవండి: మహువా బహిష్కరణ వేటుపై దీదీ ఆగ్రహం.. ఏమన్నారంటే

మ‌రోవైపు, బీజేపీ కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందంటూ ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మ‌మ‌తా బెన‌ర్జీ తీవ్రంగా స్పందించారు. మొయిత్రకు తమ పార్టీ అండగా నిలుస్తుందన్నారు. ఎథిక్స్ క‌మిటీ నివేదిక అనంత‌రం మహువ మొయిత్రకు స‌భ‌లో మాట్లాడే అవ‌కాశం ఇవ్వకపోవడం అప్రజాస్వామికమని దీదీ విమర్శించారు. పార్లమెంటు చరిత్రలో ఇది విషాదకరమైన ఘట్టమన్నారు. పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే మిగిలుండగా జరిగిన ఈ ఘటన అత్యంత దురదృష్టకరమని, దీనిని తాము అంగీకరించబోమని స్పష్టంచేశారు.

మొయిత్ర బహిష్కరణ రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడవడమేనని మమత వ్యాఖ్యానించారు. ప‌శ్చిమ బెంగాల్‌ శాసనసభలో ఎవ‌రినైనా తక్షణమే బహిష్కరించే అవకాశం, అంతటి అధికారం ఉన్నప్పటికీ, తాము అలా ప్రవర్తించలేదన్నారు. తాము నైతికతకు కట్టుబడి ఉంటామని, ప్రజాస్వామిక విలువలను పరిరక్షిస్తూ, సభ్యుల రాజ్యాంగ హక్కులను గౌరవిస్తామని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు