కాంగ్రెస్ నేత శశిథరూర్(Shashi Tharoor), టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా(Mahua Moitra) కలిసి ఉన్న ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. మహువా మోయిత్రా శశిథరూర్‌తో క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అవి. అందులో ఇద్దరూ షాంపైన్ తాగుతున్నట్టు ఫొటోలుకు ఫోజులు ఇచ్చారు. మోయిత్రా అయితే సిగరేట్ తాగుతూ ఫొటోలో కనిపించింది. ఈ ఫొటోలను బీజేపీ ఫాలోవర్లు ఎక్కువగా షేర్ చేస్తున్నారు. సిగరేట్ తాగుతూ ఫొటోలో కనిపిస్తున్న మోయిత్ర టార్గెట్‌గా సోషల్‌మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. మోయిత్రా, శశిథరూర్ మధ్య ఏదో ఉందని ట్వీట్లు పెడుతున్నారు.
స్పందించిన మోయిత్రా:
సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మోయిత్రా స్పందించారు. తనకు అసలు సిగరేట్ తాగే అలవాటే లేదని చెప్పారు. సిగరేట్ స్మెల్ కూడా పడదని తెలిపారు. సిగరెట్ల అంటే తనకు అలెర్జీ కూడా ఉందని చెప్పారు. అది కేవలం ఫొటోలకు ఫోజు ఇవ్వడమే కోసమే చేశానని క్లారిటీ ఇచ్చారు. ఈ ఫొటోలను షేర్ చేస్తున్న బీజేపీ ఫాలోవర్లపై ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఫొటోలను క్రాపింగ్ చేశారని ఆరోపించారు. ఇలా సగం సగం ఫొటోలు కాకుండా పూర్తి చిత్రాలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయాలంటూ చురకలంటించారు. తమతో పాటు విందుకు హాజరైన ఇతర వ్యక్తులను చూపించమని కాషాయ పార్టీ మద్దతుదారులను కోరారు.
ALSO READ: రోహిత్ తీసుకోబోతున్న ఈ నిర్ణయం టీమిండియా కొంపముంచనుందా? ఈ టైమ్‌లో ఇలా చేయడం కరెక్టేనా?
మహువా మోయిత్రా మరో ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌లో 'నాకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను @BJP4India సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చూశాను. నాకు తెల్లటి బ్లౌజ్ కంటే గ్రీన్ డ్రెస్ బాగా ఇష్టం. రాత్రి విందుకు వచ్చిన మిగిలిన వారిని కూడా చూపించండి. బెంగాల్ మహిళలు జీవితాన్ని గడుపుతున్నారు.ఇది అబద్ధం కాదు.'
మరోవైపు మోయిత్రా స్పందించిన తర్వాత కూడా ఆమెపై ట్రోలింగ్ ఆగడంలేదు. శశిథరూర్‌తో ఆమెకు ఏదో సంబంధం ఉందంటూ కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ALSO READ: క్రికెట్ చూడడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా? ఎవరైనా అడిగితే ఈ విషయాలు చెప్పండి!