మహీంద్రా అండ్ మహీంద్రా(Mahindra And Mahindra) కంపెనీ తయారు చేసిన వాహనం వల్ల తన కుమారుడు చనిపోయినట్లు యూపీకి చెందిన రాజేశ్ అనే వ్యక్తి ఆనంద్ మహీంద్రా తో కలిపి సంస్థలోని మరో 12 మంది కేసు పెట్టాడు. తాను మహీంద్రా కంపెనీ వద్ద కొన్ని స్కార్పియో వాహనంలో ఎయిర్ బ్యాగ్స్ ప్రమాదం జరిగిన సమయంలో తెరుచుకోకపోవడం వల్లే తన కుమారుడు అపూర్వ్ మరణించినట్లు రాజేశ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
దీంతో రాజేశ్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆనంద్ మహీంద్రా సహా మరో 12 మంది పై ఎఫ్ ఐఆర్(FIR) నమోదు చేశారు. ఈ విషయం గురించి తెలుసుకున్న మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ యజామాన్యం స్పందించింది. తమ సంస్థ తయారు చేసిన వాహనాల్లోని ఎయిర్ బ్యాగ్స్ పని తీరులో ఎలాంటి లోపం లేదని వారు స్పష్టం చేశారు.
అసలు ప్రమాదం సమయంలో ఎయిర్ బ్యాగ్స్ (Air Bags) తెరుచుకోకపోవడానికి గల కారణాలను వివరించింది. అపూర్వ్ స్కార్పియో లో ప్రయాణిస్తున్న సమయంలో సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ ప్రమాద సమయంలో కారు పల్టీలు కొట్టడం వల్ల ఎయిర్ బ్యాగ్ లు తెరుచుకోలేదని వివరించారు. అసలు కొందరు ఆ కారులో ఎయిర్ బ్యాగ్స్ లేవని ఆరోపిస్తున్నారు.
కానీ ఆ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణీకులు భద్రత విషయంలో తమ సంస్థ ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.
యూపీకి చెందిన రాజేశ్ మిశ్రా అనే వ్యక్తి 2020 లో మహీంద్రా కంపెనీకి చెందిన బ్లాక్ స్కార్పియోను రూ.17.39 లక్షలు పెట్టి కొనుగోలు చేశాడు. దానిని ఆయన అతని కుమారుడు అపూర్వ్ కు బహుమతిగా ఇచ్చాడు.జనవరి 14, 2022 న అపూర్వ్ తన స్నేహితులతో కలిసి లక్నో నుంచి కాన్పూర్ కు వస్తున్న క్రమంలో పొగమంచు కారణంగా అపూర్వ్ నడుపుతున్న కారు డివైడర్ ను ఢీకొట్టి బోల్తాపడింది. దీంతో అపూర్వ్ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మరణించాడు. అతని స్నేహితులు కూడా తీవ్రంగా గాయపడ్డారు.
దీంతో రాజేశ్ మిశ్రా తాను కారు తీసుకున్న ఆటో స్టోర్ వద్దకు చేరుకుని కారులో ఉన్న లోపాలన్నింటిని కంపెనీ వారికి తెలియజేశాడు. ప్రమాదం జరిగిన సమయంలో అపూర్వ్ కారులోని సీట్ బెల్ట్ పెట్టుకునే ఉన్నాడు. కానీ ప్రమాదం జరిగిన సమయంలో ఎయిర్ బ్యాగ్ లు సరిగా తెరుచుకోకపోవడం వల్లే ప్రమాదంలో తన కొడుకు మరణించినట్లు రాజేశ్ మిశ్రా ఆరోపించారు.
కంపెనీ కారును అమ్మినప్పుడు అన్ని కూడా తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేసిందని రాజేశ్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఒక కారును మార్కెట్ లోకి విడుదల చేసే ముందు నిశీతంగా పరిశీలించి ఉంటే కనుక ఈ ప్రమాదంలో తన కొడుకు మరణించి ఉండేవాడు కాదని ఆయన పేర్కొన్నారు.
మహీంద్రా సంస్థ మోసపూరిత చర్యలకు పాల్పడిందని ఆరోపించారు. రాజేశ్ ఎక్కడైతే కారును కొనుగోలు చేశారో అక్కడికి ఆ ఆటోస్టోర్ వద్దకు వచ్చి గొడవకు దిగడంతో, సంస్థలో పని చేసే ఉద్యోగులు కూడా అతనితో పాటు వాగ్వాదానికి దిగారు. దీంతో పరిస్థితి అదుపు తప్పింది. సంస్థ డైరెక్టర్ల సూచనల మేరకు నిర్వాహకులు తనను , తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారని రాజేశ్ ఆరోపించారు.
కారు ప్రమాదం జరిగిన తరువాత స్కార్పియోను రుమాలోని మహీంద్రా కంపెనీ షోరూమ్కు తరలించారు. కంపెనీ కారులో ఎయిర్ బ్యాగ్ లను ఏర్పాటు చేయలేదని రాజేశ్ ముందు నుంచి ఆరోపించారు. అందుకు గానూ మోసం చేసినందుకు గానూ సెక్షన్ 420, 287, 304-A మరి కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం జరిగింది.