/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-9-4.jpg)
Murari Re-Release : ప్రస్తుతం టాలీవుడ్ (Tollywood) లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది. ఒకప్పుడు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన తమ పేవరెట్ హీరోల చిత్రాలను మరోసారి థియేటర్స్ లో చూసేందుకు ఇష్టపడవుతున్నారు ఫ్యాన్స్. రీ రిలీజ్ అనే కాన్సెప్ట్ తో ఇప్పటికే విడుదలైన పలు సూపర్ హిట్ సినిమాలు రెండో సారి కూడా అదే క్రేజ్ తో బాక్సాఫీస్ ముందు సత్తా చూపించాయి.
Nijam ga pelli cheskunaru🤣🔥 #Murari4K pic.twitter.com/kRABlUVBWM
— VardhanDHFM (@_VardhanDHFM_) August 9, 2024
తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన 'మురారి' (Murari) రీ రిలీజ్ అయింది. మహేష్ బర్త్ డే (Mahesh Babu Birthday) సందర్భంగా రీ రిలీజ్ చేసిన ఈ మూవీ థియేటర్స్ లో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. గతంలో ,మారె స్టార్ హీరో రీ రిలీజ్ మూవీకి లేని హైప్ ఈ సినిమాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ అభిమాని ప్రేమించిన అమ్మాయితో ని ‘మురారి’ థియేటర్‌లోనే పెళ్లి చేసుకున్నాడు.
Brahmaramba lo akshinthalu panchuthunnaru 😭#Murari4K @urstrulyMahesh pic.twitter.com/UcG6WE2QAS
— 28 (@898SAG) August 9, 2024
Also Read : ధనుష్ కు జోడిగా ‘ఆదిపురుష్’ బ్యూటీ..!
హైదరాబాద్ లోని ఓ థియేటర్ లో మహేష్ అభిమాని తన ప్రేయసిని థియేటర్ లోనే తాళిబొట్టు కట్టి పెళ్లి చేసుకున్నాడు. మరో అభిమాని ఏకంగా అక్షింతలు పంచాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ 'ఇదెక్కడి మాస్ పెళ్లి రా మావా', 'క్రేజీ మ్యారేజ్', 'ట్రూ మహేష్ ఫ్యాన్' అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.