/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-10-6.jpg)
Mahesh Babu Family : టాలీవుడ్ అగ్ర హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీ కాలినడకన తిరుమలకు చేరుకొని మొక్కులు చెల్లించారు. మహేశ్ బాబు భార్య నమ్రత, కుమారుడు గౌతమ్, కూతురు సితార అలిపిరి కాలినడక మార్గంలో శ్రీవారి దర్శనానికి వెళ్లారు. కాలినడకన వచ్చే భక్తులు మహేశ్ బాబు ఫ్యామిలీతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. గురువారం ఉదయం శ్రీవారిని వారు దర్శించుకోనున్నారు.