/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-61.jpg)
MS Dhoni: 2007 టీ20 వరల్డ్ కప్ హీరోస్ మహేంద్ర సింగ్ ధోని, జోగిందర్ శర్మ 12 ఏళ్ల తర్వాత ఒకచోట కలిశారు. 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో చివరి ఓవర్‌ను వేసిన జోగిందర్ శర్మ.. భారత్ కు కప్ అందించిన విషయం తెలిసిందే. కాగా ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో ఆటకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే హరియాణా పోలీస్ శాఖలో డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఇటీవల మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కలిసినట్లు చెబుతూ ఓ వీడియోను జోగిందర్ శర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ‘చాలాకాలం తర్వాత ధోనీని కలిశా. నిజంగా ఇది సరికొత్త అనుభూతి. మేము కలిసి దాదాపు 12 ఏళ్లు అవుతోంది’ అంటూ సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
View this post on Instagram