ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

New Update
ACB Raids : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సబ్ రిజిస్ట్రార్..!

ACB Raids :  భూమి రిజిస్ట్రేషన్ విషయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ కార్యాలయంపై ఏసీబీ అధికారులు ముందస్తు సమాచారంతో దాడులు నిర్వహించారు. సబ్ రిజిస్ట్రర్ మహమ్మద్ తస్లిమా, డేటా ఆపరేటర్ ఆలేటి వెంకటేశ్ 19,200 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్ట్రర్ ఆఫీసుపై ఏసీబీ అధికారులు పక్కా సమాచారంతో సాయంత్రం దాడులు నిర్వహించారు.

publive-image publive-image

గూడగాణి హరీశ్ అనే వ్యక్తి తన భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. దీంతో సబ్ రిజిస్ట్రార్ లంచం డిమాండ్ చేశారు. సబ్ రిజిస్ట్రర్ మహ్మద్ తస్లీమా డేటా ఆపరేటర్ మధ్యవర్తిగా రూ 19,200 లంచం తీసుకుంటుండగా వరంగల్ కు చెందిన ఏసీబీ అధికారలుు దాడి చేశారు. వారిద్దరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: మందుబాబులకు హైదరాబాద్ పోలీసుల షాక్.. ఆ రోజున మద్యం షాపులు బంద్!

Advertisment
Advertisment
తాజా కథనాలు