TDP : మహాసేన రాజేష్(Maha Sena Rajesh).. గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో(AP Politics) సంచలనంగా మారారు. నిన్నటి వరకు టీడీపీ ఉంటూ ప్రత్యర్థుల పై తీవ్రస్థాయిలో దాడి చేసిన ఆయన ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. పి.గన్నవరంలో టీడీపీ అభ్యర్థిగా మహాసేన రాజేష్ ని ప్రకటన చేసిన తరువాత రాజకీయాల్లో మారిన పరిస్థితుల వల్ల ఆయన పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
అప్పటి నుంచి సైలెంట్ గా ఉన్న రాజేష్ ఇప్పుడు ఒక్కసారిగా సోషల్ మీడియా(Social Media) లో పెద్ద బాంబు పేల్చారు. ఏపీలో బీజేపీ(BJP) ని ఎదిరించే పార్టీ లేదంటూ అందరి పై ఆరోపణలు కురిపించారు. ఏపీలో ఉన్న పార్టీలు అన్ని కూడా బీజేపీకే మద్దతు ఇస్తున్నాయని.. ఇది ప్రజాస్వామ్యానికే పెద్ద ప్రమాదమని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే.. మహాసేన రాజేష్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు... '' నేను టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిని.. రాష్ట్ర స్టీరింగ్ కమిటీ మెంబర్ ని. టీడీపీ ఎస్సీ సెల్ కు రాష్ట్ర లీడర్ ని. త్వరలో మా పార్టీ అధికారంలోకి వస్తుంది అప్పుడు నేను ఎమ్మెల్సీ కానీ.. స్టేట్ చైర్మన్ కానీ అవుతాను. అయినా ఇంతటి గౌరవాన్ని ఇచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి క్షమాపణలు చెప్పి పార్టీ నుంచి బయటకు రావడానికి నేను సిద్దంగా ఉన్నానని" మహాసేన రాజేష్ తెలిపారు.
ఇప్పటికే సుమారు 1000 నియోజకవర్గాల్లో పోటీ కి సిద్దమయినట్లు రాజేష్ తెలిపారు. ఇది పదవి కోసం కాదు.. మా ఆత్మగౌరవం కోసం మాత్రమే.. అంటూ రాసుకొచ్చారు.