Maharashtra Government : ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి మహిళలకు ప్రతీ నెల రూ.1,500!

రాఖీ పౌర్ణమి పండుగ వేళ మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడి మహిళలకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాలో నెలకు రూ.1500 లను షిండే ప్రభుత్వం జమ చేయనుంది.

New Update
Maharashtra Government : ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుంచి మహిళలకు ప్రతీ నెల రూ.1,500!

Mukhyamantri Majhi Ladki Bahin Scheme : మహారాష్ట్ర (Maharashtra) లో షిండే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని రోజుల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) జరగనున్న క్రమంలో మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు మరో పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది. రాఖీ పౌర్ణమి (Raksha Bandhan) పండుగ వేళ అక్కడి మహిళలకు శుభవార్త చెప్పింది. ముఖ్యమంత్రి లడ్కీ బహీన్ యోజన పథకాన్ని ఈరోజు నుంచి ప్రారంభించనుంది. ఈ పథకం ద్వారా అర్హులైన మహిళల ఖాతాలో నెలకు రూ.1500 లను షిండే ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు ఈ పథకం కోటి మంది మహిళలకు లబ్ధి చేకూరుస్తుందని మహారాష్ట్ర సీఎం ఎకనాథ్ షిండే చెప్పారు. అలాగే జూన్, జులై నెలతో కలిపి మొత్తం రూ.3,000 మహిళల ఖాతాలో జమ చేయనున్నట్లు చెప్పారు. ఈ పథకం కొరకు మహారాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.46,000 కోట్ల భారం పడనుంది.

ఈ పథకానికి ఎవరు అర్హులు..

మహారాష్ట్రలోని మహిళలకు ఈ పథకం ప్రయోజనం లభిస్తోంది. అయితే, వారి వయస్సు 21 నుండి 65 సంవత్సరాల మధ్య మాత్రమే ఉండాలి. దీని కంటే ఎక్కువ లేదా తక్కువ ఉంటే, వారు ఈ పథకం యొక్క ప్రయోజనం పొందలేరు. అలాగే, వారి వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందుతుంది.

ఎలా దరఖాస్తు చేయాలి?

ఈ పథకం కింద ఎలాంటి ఛార్జీలు తీసుకోరు. ఈ పథకం కింద పౌరులను నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం నారీ శక్తి దూత్ యాప్ పేరుతో మొబైల్ అప్లికేషన్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ వినియోగదారులను ఈ కోసం లబ్ధిదారులను నమోదు చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఇది ఆండ్రాయిడ్, IOS పరికరాల్లో పని చేసేలా రూపొందించబడింది.

Also Read : హైదరాబాద్‌లో ఘోర ప్రమాదం.. బస్సు కింద నలిగిపోయిన ఆటో

Advertisment
Advertisment
తాజా కథనాలు