Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత

గుండెపోటుతో మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నూమూశారు. రెండు రోజుల క్రితం హార్ట్ ఎటాక్‌తో ఆసుపత్రిలో జాయిన్ అయిన ఆయన ఈరోజు తెల్లవారు ఝామున 3 గంటలకు తుది శ్వాస విడిచారు.

Maharashtra : మహారాష్ట్ర మాజీ సీఎం మనోహర్ జోషి కన్నుమూత
New Update

Manohar Joshi : శివసేన పార్టీ(Shiv Sena Party) నేత, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి(Manohar Joshi) మృతి చెందారు. 86 ఏళ్ళ మనోహర్ జోషి రెండు రోజుల క్రితం గుండెపోటు(Heart Attack) తో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. పీడీ హిందూజా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోషి ఈరోజు తెల్లవారు ఝామున 3గంటలకు మరణించారు. గత కొన్ని రోజులుగా ఆయన వృద్ధాప్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు. 2023 మేలో మెదడులో రక్తస్రావం కారణంగా మనోహర్ జోషి ఒకసారి ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అప్పటి నుంచే ఆయన ఆరోగ్యం సరిగ్గా లేదు. దాంతో పాటుగా రెండు రోజుల క్రితం గుండెపోటు రావడంతో మనోహర్ జోషి తుదిశ్వాస విడిచారు.

శివసేన కీలకనేత..

శివసేన పార్టీలో కీలకనేతగా ఎదిగారు మనోహర్ జోషి. 1995 నుంచి 1999 వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్న కాలంలో 2002 నుంచి 2004 వరకు లోక్‌సభ స్పీకర్‌(Lok Sabha Speaker) గానూ వ్యవహరించారు. 1937 డిసెంబర్‌ 2న నాంద్వీలో జోషి జన్మించారు. విద్యాభ్యాసం మొత్తం ముంబయి(Mumbai) లోనే సాగింది. మొదట టీచర్‌గా పని చేసిన జోషి 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. మున్సిపల్ కౌన్సిలర్‌గా, ముంబయ్ మేయర్‌గా కూడా విధులు నిర్వహించారు. తరువాత 1972లో మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. దాని తరువాత ముడూసార్లు ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 1990లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1999లో శివసేన తరుఫున ముంబయి నార్త్‌-సెంట్రల్‌ నియోజవర్గం నుంచి ఎంపీగా విజయం సాధించారు.

ఈయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మనోహర్ జోషి భార్య అనఘ మనోహర్‌ జోషి 2020లో మరణించారు.

Also Read : Telangana : లాస్య నందిత మృతికి మూడు కారణాలు..

#maharashtra #heart-attack #manohar-joshi #shiv-sena-party
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe