/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-94-jpg.webp)
Lokesh kanagaraj: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(Lokesh kanagaraj)కు ఊహించని షాక్ తగిలింది. స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మైవీ ‘లియో’ (LEO) సినిమాలో లోకేష్ హింసను ప్రేరేపించారంటూ మధురైకు చెందిన రాజు మురుగన్ (Raju murugan) అనే వ్యక్తి మధురై హైకోర్టు బెంచ్‌లో పిటిషన్ వేశారు.
ఈ లోకేష్ కనగరాజ్ మానసిక పరిస్థితి సరిగా లేదు. అందుకే 'లియో' సినిమాలో హింసను ప్రేరేపించారు. అతనికి సైకలాజికల్ పరీక్షలు నిర్వహించాలి. లేదంటే ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని తప్పుదోవ పట్టించే అవకాశం ఉంటుంది. సినిమాలో మారణాయుధాలు, డ్రగ్స్, మతపరమైన చిహ్నాలు, మహిళలు, చిన్నారులపై హింసను ప్రేరేపించే సన్నివేశాలు ఉన్నాయి. వెంటనే ఈ సినిమాను బ్యాన్ చేయాలని రాజు మురుగన్ పిటిషన్‌లో కోరారు. అయితే ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్ కృష్ణ కుమార్, జస్టిస్ విజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం.. లోకేష్ తరపు న్యాయవాదులు హాజరు కాకపోవడంతో ఈ కేసును వాయిదా వేసింది.
ఇది కూడా చదవండి : Aamir Khan: అందరిముందే మాజీ భార్యకు ముద్దులు.. అమీర్ ఖాన్ చేష్టలకు నెటిజన్లు షాక్ (వీడియో)
ఇక 2023 అక్టోబర్ 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.600 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇందులో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ తదితరులు కీలక పాత్రల్లో నటించిన మెప్పించారు.