చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, త్రిషకు మద్దతు పలికిన చిరంజీవి, ఖుష్బూలపై పరువునష్టం దావా వేసిన తమిళ నటుడు మన్సూర్ అలీఖాన్ కు కోర్టు జరిమానా విధించింది. కేవలం పబ్లిసిటీ కోసమే ఆయన ఇలా చేస్తున్నారంటూ మండిపడింది.

New Update
చిరంజీవిపై కోర్టుకెక్కిన మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా

నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ప్రముఖ నటి త్రిష పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై నటికి మద్దతుగా నిలిచిన చిరంజీవి, ఖుష్బూలపై ఆయన పరువు నష్టం కేసు వేశాడు. అయితే అది ఆయనకు బెడిసికొట్టింది. కోర్టు తిరిగి మన్సూర్‌ కు మొట్టికాయలు వేసింది. మన్సూర్‌ వేసిన వ్యాజ్యం వల్ల కోర్టు టైమ్‌ వేస్ట్‌ అవ్వడమే కాకుండా, అందులో నిజాలు లేవని కేవలం పబ్లిసిటీ కోసం ఆయన ఇలా చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అందుకు గానూ మన్సూర్‌ కు కోర్టు లక్ష రూపాయల జరిమానాను విధించింది. త్రిషతో లియో సినిమాలో తనకు రేప్‌ సీన్ ఉంటుందని భావించానని కానీ కనీసం ఆమెతో ఒక్కసీన్‌ కూడా చేయలేకపోయానని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దీంతో సినీ పరిశ్రమలోని పెద్దలు ఆమెకు అండగా నిలిచారు.

వారిలో చిరంజీవి, రాధిక, ఖుష్బూ కూడా ఉన్నారు. ఈ క్రమంలో మన్సూర్‌ చిరంజీవి , కుష్బూ తనని మాటలతో వేధించారని పేర్కొన్నాడు. వారిద్దరూ కూడా చెరో కోటి రూపాయలు తనకి నష్ట పరిహారంగా చెల్లించాలని న్యాయస్థానాన్ని కోరాడు. దీంతో మద్రాస్ హైకోర్టు మన్సూర్ అలీఖాన్ వ్యాజ్యంపై మండిపడింది. పరువునష్టం దావా వేసినట్టు లేదు, పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది అంటూ అక్షింతలు వేసింది! ఈ క్రమంలో అతడి పిటిషన్ ను కొట్టివేసింది.

కోర్టు అంతటితో వదిలిపెట్టలేదు.తమ సమయం వృథా చేశాడంటూ మన్సూర్ అలీఖాన్ కు రూ.1 లక్ష జరిమానా విధించింది.ఆ జరిమానాను అడయార్ కేన్సర్ ఇన్ స్టిట్యూట్ కు చెల్లించాలని ఆదేశించింది.

Also read: హరిరామజోగయ్య లేఖకు పవన్ రిప్లై.. సీఎం అభ్యర్థిపై సంచలన వ్యాఖ్యలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు