విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ

విక్రమ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ల ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి దర్శకుడు గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్‌ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే ఈ సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు జారీ చేసింది.

విక్రమ్‌ ‘ధృవ నక్షత్రం’కు మద్రాస్ హైకోర్టు షాక్.. రిలీజ్ పై ఉత్కంఠ
New Update

స్టార్ హీరో చియాన్ విక్రమ్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌ కాంబోలో వస్తున్న తాజా చిత్రం ‘ధృవ నక్షత్రం’. నవంబర్ 24న విడుదల కావాల్సిన మూవీ మరోసారి వాయిదాపడింది. దర్శకుడు గౌతమ్, నిర్మాణ సంస్థ ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ మధ్య ఆర్థికపరమైన గొడవలు తలెత్తడంతో ఈ ఇష్యూ కోర్టు వరకూ వెళ్లింది. దీంతో తాజాగా దీనిపై తీర్పు ఇచ్చిన మద్రాస్ హైకోర్టు ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా రిలీజ్ ఆపేయాలని స్పష్టం చేసింది.

అసలు విషయానికొస్తే.. 2016లోనే ఈ సినిమా పట్టాలెక్కింది. 2017లో విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ ఆర్థిక సమస్యల కారణంగా వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ నెల 24న విడుదల చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. అయితే శింబు హీరోగా గౌతమ్‌ మేనన్‌ ‘సూపర్‌ స్టార్‌’ అనే చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఒప్పందం కుదుర్చుకుని, ఆ మేరకు రూ.2.40 కోట్లు తీసుకున్నారని, కానీ ఆయన సినిమాని పూర్తి చేయలేదని.. డబ్బు తిరిగి ఇవ్వలేదని ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ తరఫున హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. నగదు తిరిగి ఇవ్వకుండా ‘ధృవ నక్షత్రం’ సినిమా విడుదల చేసేందుకు నిషేధం విధించాలని పిటిషన్‌లో కోరారు. గురువారం ఈ కేసు విచారణకు రాగా న్యాయస్థానం సినిమా విడుదలకు షరతు విధించింది. ఆల్‌ ఇన్‌ పిక్చర్స్‌ నుంచి గౌతమ్ తీసుకున్న డబ్బును నవంబర్‌ 24న ఉదయం 10.30 గంటల లోపు తిరిగి ఇవ్వాలని, లేదంటే సినిమా విడుదల చేయకూడదని ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ సినిమాలో రీతూవర్మ, సిమ్రన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Also read : Bhagavanth Kesari: ఓటీటీ లో బాలయ్య భగవంత్ కేసరి..!

ఇదిలావుంటే.. ఇటీవల ఓ సందర్భంలో సినిమాను ఉద్దేశిస్తూ మాట్లాడిన గౌతమ్.. ‘నటనపై ఆసక్తితో సినిమాల్లో నటించడం లేదు. ‘ధృవ నక్షత్రం’ కోసమే నేను నటుడిగా మారా. ఆయా చిత్రాల్లో యాక్ట్‌ చేసినందుకుగాను వచ్చిన పారితోషికాన్ని ఈ సినిమా మేకింగ్‌.. విడుదల కోసం ఉపయోగించా. సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఇప్పటివరకూ ఎవరినీ అడగలేదు. కొన్ని సినిమాల్లో అవకాశాలనూ వదులుకున్నా’ అంటూ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

#dhruva-nakshatra #madras-high-court #vikram
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe