మధ్యప్రదేశ్ లో దారుణం..ఓ వ్యక్తిని బట్టలు విప్పించి నోటితో బూట్లు ఎత్తించారు...!

మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన అమానుష ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముగ్గురు గిరిజన వ్యక్తులు ఓ అగ్రవర్ణ వ్యక్తిని చేతులు వెనక్కికట్టి వివస్త్రుణ్ణి చేసి, నోటితో బూట్లు ఎత్తించారు. ప్రస్తుతం ఆ ఘటన వైరల్ గా మారింది.ఓ అగ్రవర్ణ వ్యక్తిని కొంతమంది గిరిజనులు ఇలా చేయడం గమనార్హం.

New Update
మధ్యప్రదేశ్ లో దారుణం..ఓ వ్యక్తిని బట్టలు విప్పించి నోటితో బూట్లు ఎత్తించారు...!

సాటి వ్యక్తిని గౌరవించలేని సమాజం సమాజమే కాదు, మనుషుల్ని మానసికంగా చంపేసేందుకు దర్మార్గులు ఎంచుకునే సులువైన మార్గం...వారిని వివస్త్రలుగా చేలుగా చేయడం. అవమానానికి గురైన వారు తమవారు కాదనే అహంకారం.

publive-image

సమయం పట్టొచ్చుగాక దుర్మార్గం ఎప్పటికైనా బయటపడుతుంది. బాధితుల గుండెల్లో గూడుకట్టుకున్న ఆక్రందన  ఎప్పుడో ఒకప్పుడు చల్లారుతుంది. అమానుష చర్యకు పాల్పడినవారి పాపం పండేందుకు రెండేళ్లు పట్టింది.

2021 లో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు వైరల్ అయింది. దీంతో ముగ్గురు నిందితులను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. మధ్యప్రదేశ్‌లోని రేవా జిల్లాలో జరిగిన ఆ ఘటన వివరాల్లోకి వెళితే.. కొందరు అల్లరి మూకలు 34 ఏళ్ల వయసున్న ఒక వ్యక్తిన వివస్త్రుణ్ణి చేశారు.

అతని రెండు చేతులను వెనక్కి కట్టి, ఘోరంగా కొట్టి, నీచంగా తిట్టారు. నోటితో తమ షూస్ ను ఎత్తాలంటూ ఆ వ్యక్తిని బలవంతం చేశారు. "దయచేసి నన్ను వదిలేయండి" అని ఆమె వేడుకున్నా అల్లరి మూకలు కనికరించలేదు.

రేవా జిల్లాలోని హనుమ్నా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిప్రాహి గ్రామంలో 2021 మేలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో గతవారం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చివరకు ఇది పోలీసులకు కూడా చేరడంతో యాక్షన్ మొదలైంది.

వీడియో ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ (55), అతని ఇద్దరు సహచరులను సోమవారం అరెస్టు చేశారు. స్థానిక కోర్టులో హాజరుపర్చిన అనంతరం ముగ్గురిని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.

ఆస్తి వివాదమే ఈ ఘటనకు ప్రధాన కారణమని రేవా జిల్లా ఎస్పీ వివేక్ సింగ్ వెల్లడించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు గిరిజన వ్యక్తి కాగా, బాధితురాలు అగ్రవర్ణానికి చెందిన వ్యక్తి. ఆమె భర్తనే వివస్త్రుణ్ణి చేశారని ఆయన చెప్పారు. ప్రధాన నిందితుడు జవహర్ సింగ్ ప్రభుత్వ పాఠశాలలో క్లర్క్‌ గా పనిచేస్తున్నాడని, అతడు ఒక గ్రామ సర్పంచ్ భర్త అని ఎస్పీ వివరించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు